ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి అఖిల పక్ష నేతలు చేపట్టిన ధర్నాకు మద్దతివ్వడానికి హైదరాబాద్ వస్తోన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య నిర్బంధం జరుగుతోందని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 మంది విద్యార్థుల బలవన్మరణానికి కారణమైన వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు పది లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : ముందస్తుగా పలువురు నాయకుల గృహ నిర్బంధం