వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానం భర్త కైసర్ అహ్మద్ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా శనివారం ఎన్నికయ్యారు. కైసర్ స్వస్థలం ధర్మపురి మండలం రాయపట్నం. 1996లో ఆయిన పంచాయతీ వార్డు సభ్యుడిగా, 2002లో తిమ్మాపూర్ సహకార సంఘం కో ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గతంలో రాజకీయాల్లో చురుగ్గా ఉన్న కైసర్ కొన్నేళ్లుగా వాటికి దూరంగా ఉంటున్నారు. ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యులు కైసర్ను.. కో ఆప్షన్ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన చొరవ కారణంగానే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ అవకాశం కల్పించారని కైసర్ తెలిపాడు.
ఇవీ చూడండి: అటవీ అధికారులపై గ్రామస్థుల రాళ్ల దాడి