ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించారు. బాల్క సురేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రేగుంట రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నారు. సురేశ్ చిత్రపటానికి నివాళులర్పించి బాల్క సుమన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి, మెట్‌పల్లి మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సురేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారానే హైదరాబాద్ బయలుదేరారు.
సురేందర్ రెడ్డి విగ్రహానికి నివాళులు
అనంతరం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ వద్ద సీఎం కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి సురేందర్ రెడ్డి విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆర్మూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సీఎం సందర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెంట ఉన్నారు.
ఇదీ చదవండి: YS Sharmila:ఈటల.. పార్టీలో చేరతానంటే స్వాగతిస్తా: వైఎస్ షర్మిల