CM KCR Election Campaign in Dharmapuri : ధరణి పోర్టల్ ఉండటం వల్ల రైతుల మధ్య భూమి గొడవలు లేవని గులాబీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారని మండిపడ్డారు. ధరణి తీసేస్తే.. రైతుబంధు, రైతుబీమా ఎలా వస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో మళ్లీ లంచాలు, దళారుల రాజ్యం వస్తుందని వాఖ్యానించారు. ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్న తెలంగాణ బీజేపీ, కాంగ్రెస్‌లు అధికారంలోకి వస్తే అశాంతి చెలరేగుతుందని ఆరోపించారు. ఎవరూ అడగకుండానే.. రైతుబంధు, దళితబంధు తెచ్చానని కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR Speech At Dharmapuri Public Meeting : జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. గోదావరి పుష్కరాలు ధర్మపురిలో ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. గోదావరి అంటే రాజమండ్రి మాత్రమే గుర్తొచ్చేదని.. తన డిమాండ్‌తోనే ధర్మపురిలో పుష్కరాలు జరుపుకున్నామని చెప్పారు. కొప్పుల ఈశ్వర్ ధర్మపురిని బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. అభ్యర్థి చరిత్రతో పాటు వారి పార్టీ చరిత్ర కూడా గమనించాలని ప్రజలకు సూచించారు. కొప్పుల ఈశ్వర్ సౌమ్యశీలి అని.. మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి అని కొనియాడారు. ఈశ్వర్.. ప్రజాసంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడతారని.. ఆయనకు ఓటు వేసి గెలిపించాలని సీఎం కోరారు.
ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది : సీఎం కేసీఆర్
"దేశ ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పూర్తిగా రాలేదు. ఎన్నికల్లో ప్రజలు గెలవనంతవరకు దేశం బాగుపడదు. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉన్న వజ్రాయుధం ఓటు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ఇవాళ దేశంలో తెలంగాణ మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తోంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ.. తలసరి విద్యుత్ వినియోగంలో ముందుంది. నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ కోసం, ప్రజల బాగుకోసం పుట్టిందే బీఆర్ఎస్. ఎన్నికలు వస్తాయి పోతాయి. ఎంతో మంది వ్యక్తులు ఎన్నికల్లో నిల్చొంటారు. ఒక్కరే గెలుస్తారు. గెలిచిన వ్యక్తుల ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. అభ్యర్థుల వెనక ఏ పార్టీ ఉందన్నది చూడాలి. పోటీలో ఉన్న వ్యక్తి గుణగణాలతో పాటు పార్టీ చరిత్ర, నడవడిక, దృక్పథం చూడాలి." - కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు
CM KCR On Telangana Development at Dharmapuri Meeting : ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు అని.. అది జరగాలంటే ప్రజలు బాగా ఆలోచించాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాధించిన వ్యక్తిగా చెప్పడం తన బాధ్యత అని అన్నారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మళ్లీ వచ్చి ఒక్క ఛాన్స్ అంటోందని.. అధికారమిస్తే పంటికి అంటకుండా దోచేద్దామని కాంగ్రెస్ నేతలు చూస్తున్నారని ఆరోపించారు. ధర్మపురిలో లక్షా 30 వేల ఎకరాలు సాగునీరు వచ్చేలా చేశామని.. మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు బాగు చేసుకున్నామని.. చెక్ డ్యాంలు కట్టుకున్నామని తెలిపారు. తెలంగాణ వచ్చినరోజు ఇక్కడ చిమ్మచీకటిగా ఉందని.. మేధావులు, నిపుణులు, ఆర్థిక నిపుణలు సలహాలతో పాలించుకుంటూ ఓ దరికి వచ్చామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.
ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్
కాంగ్రెస్‌తో పొత్తు లేదు, రెండు రోజుల్లో 17 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తాం : తమ్మినేని