ఇవీ చదవండి:
జగిత్యాలలో అర్ధరాత్రి కారు బీభత్సం.. సీసీ కెమెరాలో దృశ్యాలు - Viral videos
Jagtial Car Accident CC Footage : జగిత్యాలలోని కరీంనగర్ రహదారి.. హనీ సూపర్ మార్కెట్ సమీపంలో అర్దరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు.. రెండు బైకులను ఢీకొట్టి పక్కనే ఉన్న టెలిఫోన్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉండగా.. వారంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో నలుగురు యువకులు గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
car accident
ఇవీ చదవండి: