1978లో భూమి కోసం పోరాటం చేసిన జగిత్యాల యాత్ర స్ఫూర్తితో.. ఈ జగిత్యాల గడ్డమీది నుంచి ప్రగతిభవన్‌కు వెళ్దామని.. బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. కార్యకర్తలంతా పార్టీని ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. జగిత్యాల మినీ స్టేడియంలో.. 'జగిత్యాల బహుజన జైత్ర' బహిరంగ సభలో ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాతోపాటు వివిధ ప్రాంతాల నుంచి బీఎస్పీ కార్యకర్తలు తరలి వచ్చారు.
పల్లల ప్రకృతి వనాలు, రైతువేదికలు, సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు, ఇండస్ట్రీయల్ పార్టీల పేరుమీద వేలాది ఎకరాల ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములు గుంజుకొని.. రోడ్డుమీదకు నెట్టిన పాలకుల కోసం మాట్లాడుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బిడ్డ.. పాతరోజులుపోయినయ్.. ఇవాళ బహుజన బిడ్డలు గజరాజును ఎక్కివచ్చారన్నారు. తనకు జరిగన అన్యాయంపై బరాబర్ మాట్లాడుతామని స్పష్టం చేశారు.
'పల్లెవనాలు, రైతు వేదికలు, కలెక్టరేట్ల పేరుమీద వేలాది ఎకరాల భూమి గుంజుకున్నారు. ముదిరాజ్‌ల బిడ్డ ఈటల రాజేందర్‌ను సతాయించి పంపించారు. ఇవాళ ఆయన ఓడినా.. గెలిచినా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన నష్టం లేదు. అయినా కక్షగట్టి ఆయనను ఓడించాలని.. వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు.'
- ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఎస్పీ రాష్ట్ర కోఆర్డీనేటర్.
ఇవీచూడండి: నేడు భారత్ బంద్- అప్రమత్తమైన పోలీసులు