జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వాసుపత్రి ముందు భాజపా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష ధోరణిని విడనాడాలంటూ నినాదాలు చేశారు. వ్యాధి వ్యాప్తి పట్ల ప్రభుత్వం శ్రద్ధ వహించాలని, శానిటైజర్లు, మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు.
కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి.. ప్రజలకు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రోగులకు సరిపడా పీపీఈ కిట్లు అందుబాటులో ఉంచాలన్నారు. దాదాపు అరగంటకు పైగా ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు. పోలీసులు జోక్యం చేసుకొని భాజపా నాయకుల చేత ఆందోళన విరమింపచేశారు.
ఇదీ చూడండి: తెలంగాణకు కొత్తగా కేటాయించేది మూడు రైళ్లేనా ?