జగిత్యాల జిల్లా పరిషత్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ దంపతులు పాల్గొని బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా తయారు చేశారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..