తెలంగాణ సంప్రదాయ బతుకమ్మ పండుగ విదేశాల్లోనూ తెలంగాణ మహిళలు ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు. అమెరికాలోని డల్లాస్లో సద్దుల బతుకమ్మ వేడుకను తెలంగాణ మహిళలు ఘనంగా జరుపుకున్నారు. వందలాది మంది మహిళలు ఒక దగ్గర చేరి తీరొక్క పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో ఉయ్యాల పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.
ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!