Bandi Sanjay fire on kavitha: దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే.. సీబీఐ విచారణ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగింది. అనంతరం మేడిపల్లిలో ఆయన ప్రసంగించారు. కవిత కట్టుకున్న ఇల్లు చూసి.. ఈడీ కూడా వస్తుందని ఆయన జోష్యం చెప్పారు.
ఈరోజు ఉదయం వెంకటపూర్ నుంచి ప్రారంభమైన యాత్ర.. గుమ్లాపూర్, మేడిపల్లి, తాటిపల్లి మీదుగా చల్గల్ వరకు కొనసాగింది. ఈ రోజు సుమారు 14 కిలోమీటర్లు వరకు పాదయాత్ర కొనసాగి రాత్రికి చల్గల్ సమీపంలో బండి సంజయ్ బస చేశారు.
"కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే సీబీఐ విచారిస్తోంది. మద్యం కేసులో సీబీఐ కూపీలాగుతున్నారు. కవిత ఇంటిని చూసి ఈడీ సైతం వచ్చే అవకాశం ఉంది".- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇవీ చదవండి: