జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గుట్టపైన వెలసిన స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయ పాలకవర్గం ఆయనను శాలువాతో సత్కరించింది. దేవాలయాల అభివృద్ధికి శాయశక్తుల కృషి చేస్తానని బండి సంజయ్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు, రైతులు లక్ష్మీనరసింహస్వామి కృపతో బాగుండాలని ఆకాంక్షించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి, యాదాద్రి తరహాలో నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కాశీలో ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేక శౌచాలయాలు