ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో సర్కారు బడిని బతికించుకున్నారు - kannapur

మూతపడుతున్న సర్కారు బడిని బతికించుకునేందుకు ఊరంతా ఏకమైంది. పంచాయతీ తీర్మానం చేసి పిల్లలందర్నీ ఊళ్లోనే చదివించాలని నిర్ణయించుకున్నారు. చిన్నారుల సందడితో ఇప్పుడు పాఠశాల కళకళలాడుతూ పూర్వ వైభవం సంతరించుకుంది.

సర్కారు బడిని బతికించుకున్నారు
author img

By

Published : Jun 15, 2019, 5:53 PM IST

Updated : Jun 15, 2019, 9:27 PM IST

జగిత్యాల గ్రామీణ మండలం కన్నాపూర్​లో ప్రాథమిక పాఠశాల ఉంది. పాఠశాల పునఃప్రారంభ సమయానికి ఐదుగురు విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్నందున బడిని మూసివేయాల్సిన పరిస్థితి దాపురించింది. బడిని బతికించుకోవాలనుకున్న గ్రామస్థులు ఏకమయ్యారు. పిల్లలందర్నీ ఊళ్లోని సర్కారు బడికే పంపించాలని నిర్ణయించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలో ఎవరు చదివించినా... గ్రామపంచాయతీ నుంచి అవసరమైన ఎలాంటి ధ్రువపత్రాలు ఇచ్చేది లేదని తీర్మానించారు. కఠిన నిర్ణయమైనప్పటికీ... సత్ఫలితాన్నిచ్చింది. విద్యార్థుల సంఖ్య 40కి చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉంది.

గ్రామ పంచాయతీ తీసుకున్న కఠిన నిర్ణయంతో మూతపడాల్సిన బడికి జీవం పోశారు. ఈ నిర్ణయానికి గ్రామస్థులు మద్దతుగా నిలిచారు. బడిబాట కార్యక్రమంతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాల ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగి చిన్నారుల సందడితో బడి కళకళలాడాలని మనమూ ఆశిద్దాం...

సర్కారు బడిని బతికించుకున్నారు

ఇవీ చూడండి: వరంగల్​లో కమాండ్​ కంట్రోల్​ కేంద్రం

Intro:Body:Conclusion:
Last Updated : Jun 15, 2019, 9:27 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.