జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం బండ లింగాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి రాజేందర్ అనే అయ్యప్ప భక్తడు కాలినడకన శబరిమల యాత్రకి బయల్దేరారు. ఎనిమిదేళ్లుగా అయ్యప్ప దీక్ష చేస్తున్న ఆయన ఐదేళ్ల నుంచి పాదయాత్ర చేస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు.
మెట్పల్లి నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఇరుముడి నెత్తిన ఎత్తుకొని పాదయాత్ర చేస్తూ శబరిమలకు బయల్దేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మరికొంతమంది పాదయాత్ర చేస్తారని... డిసెంబర్ 12న శబరిమలలోని అయ్యప్ప క్షేత్రానికి చేరుకుంటామని రాజేందర్ తెలిపారు.
ఇదీ చదవండి: పర్వదినాల మాసం... మహిమాన్విత కార్తికం