ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

మెట్​పల్లిలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. కోనేటిలో స్వామివారికి అర్చకులు చక్రస్నానం చేయించారు. అనంతరం వేద మంత్రాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు.

ayyappa arattu special pooja at metpally in jagtial
మెట్పల్లిలో ఘనంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం
author img

By

Published : Dec 11, 2020, 2:50 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప ఆలయం నుంచి స్వామివారి ఉత్సవ మూర్తిని పురవీధుల గుండా ఊరేగించి.. పట్టణంలోని పురాతన ఆలయమైన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం ముందున్న కోనేటిలో చక్రస్నానం చేయించారు. వేద మంత్రాల మధ్య స్వామివారి ఉత్సవ మూర్తికి వివిధ రకాల అభిషేకాలు చేసి అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు.

ayyappa arattu special pooja at metpally in jagtial
మెట్పల్లిలో ఘనంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

అయ్యప్పస్వామి దీక్షాపరులు స్వామి వారి భజనలు చేస్తూ ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి: రోగనిరోధక శక్తిని తగ్గించే అలవాట్లు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.