ETV Bharat / state

మూడో విడత పోలింగ్​కి సిద్ధమైన జగిత్యాల - MPTC

మూడోదశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్​కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 6 జడ్పీటీసీ, 72 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మూడో విడత పోలింగ్​కి సిద్ధమైన జగిత్యాల
author img

By

Published : May 13, 2019, 4:15 PM IST

జగిత్యాల జిల్లాలో రేపు జరగబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సామగ్రి పంపిణీ జరిగింది. జగిత్యాల అర్బన్‌, జగిత్యాల గ్రామీణ మండలం, మల్యాల, కొడిమ్యాల, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో మంగళవారం పోలింగ్‌ జరగనుండగా... ఆరు జడ్పీటీసీ స్థానాలకు 28 మంది, 72 ఎంపీటీసీ స్థానాలకు 262 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందుకోసం 127 గ్రామాలు.. 380 పోలింగ్‌ కేంద్రాలకు మూడో విడత ఎన్నికల కోసం ఎన్నికల సామగ్రిని పంపించారు. ఇందుకోసం 456 మంది పోలింగ్‌ అధికారులు, 456 మంది సహాయ అధికారులు, 1777 ఇతర సిబ్బందిని నియమించారు. పది గ్రామ పంచాయతీల్లోని 75 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. జగిత్యాలలో ఎస్‌కేఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో పంపిణీ పూర్తి చేసి సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

మూడో విడత పోలింగ్​కి సిద్ధమైన జగిత్యాల

ఇవీ చూడండి: నేటితో పూర్తైన సైకో శ్రీనివాస్​రెడ్డి కస్టడీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.