జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆశ్విక (6) అనే చిన్నారి పాముకాటుతో మృతి చెందింది. చిన్నారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించేలోపే మరణించింది.
జగిత్యాల పట్టణంలోని పోచమ్మవాడకు చెందిన ఆశ్విక తన అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్లింది. అక్కడ ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మల్యాల పోలీసులు పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన మంత్రి ఎర్రబెల్లి