జగిత్యాల బైపాస్ రోడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ప్రమాదం తప్పింది. టిప్పర్ని ఓవర్‌టెక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు అదే వాహనం కిందపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం పైనుంచి టిప్పర్ దూసుకెళ్లింది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు పక్కకు ఎగిరిపడ్డారు. స్వల్వగాయాలతో బయటపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉన్నాయి. సీసీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత