పదమూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములిద్దరు కరోనా కాటుకు బలైన విషాదకర ఘటన జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లిలో చోటు చేసుకుంది. జగిత్యాలలో న్యాయవాదిగా పని చేస్తున్న గొంటి గోపాల్ ఏప్రిల్ 19న కరోనా బారినపడి మృతి చెందాడు.
ఉళ్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న గోపాల్ తమ్ముడు సతీశ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. వెంటనే కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి సతీశ్‌ను తీసుకెళ్లగా... చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. యుక్త వయసులో ఉన్న అన్నదమ్ములిద్దరు మరణించడం వల్ల కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.