YSRTP Ready to Contest in 119 Constituencies : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తాను స్వయంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలో దిగనున్నారు. పార్టీ మేనిఫెస్టో( YSRTP Manifesto) కమిటీ ఏర్పాటు, ప్రచారాన్ని ఉద్ధృతం చేయడం, ప్రజల్లోకి మేనిఫెస్టోను వేగంగా తీసుకెళ్లడం, అభ్యర్థుల ఖరారు, ప్రకటన తదితర అంశాలపై లోటస్ పాండ్లోని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ(YSR Telangana Party) కార్యాలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) పాల్గొన్నారు. బీ-ఫామ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించారు. ఎన్నికల వ్యూహా రచనపై సమావేశంలో చర్చించినట్లు షర్మిల పేర్కొన్నారు.
YSRTP Sharmila Contest in Paleru : పాలేరు నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీకి సిద్ధమయ్యారు. పాలేరుతో పాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని డిమాండ్ వస్తుందన్నారు. భర్త అనిల్, తల్లి విజయమ్మను కూడా పోటీ పెట్టాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తుందని వైఎస్ షర్మిల వెల్లడించారు. ఆ దిశగా కూడా ఆలోచన చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో కలిసివెళ్తే ప్రజా వ్యతిరేక ఓటు చీలదనుకున్నామని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
'119 నియోజకవర్గాల్లో పోటీకి వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ నిర్ణయం తీసుకుంది. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలని వైఎస్ఆర్టీపీ నిర్ణయించింది. నేను పాలేరు నుంచి బరిలో దిగుతున్నాను. పాలేరుతో పాటు మరోచోట పోటీ చేయాలని డిమాండ్ ఉంది. అనిల్, విజయమ్మను కూడా పోటీ చేయించాలని డిమాండ్ ఉంది. కాంగ్రెస్‌తో కలిసివెళ్తే వ్యతిరేక ఓటు చీలదనుకున్నాం. కాంగ్రెస్‌తో చర్చలు జరిపాం.. 4 నెలలు ఎదురుచూశాం.' -వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు
YS Sharmila on YSRTP Merger With Congress : 'పార్టీ విలీనంపై కాంగ్రెస్‌తో చర్చలు తుది దశకు వచ్చాయి'
YSRTP Focus on Telangana Assembly Elections 2023 : ప్రజా వ్యతిరేక ఓటు చీల్చిన అపఖ్యాతి తమకు వస్తుంది భావించామని.. ఓట్లు చీలిస్తే కేసీఅర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నట్లు తెలిపారు. అందుకే కాంగ్రెస్‌తో చర్చలు జరిపామని షర్మిల చెప్పారు. 4 నెలల పాటు కాంగ్రెస్(Telangana Congress) స్పందన కోసం వేచి చూశామన్నారు. సీట్ల అంశంపై సర్దుబాటు కాకపోవడం, కాంగ్రెస్ నుంచి సంతృప్తికర ప్రకటన వెలువడకపోవడం, కాంగ్రెస్‌తో చర్చలు ఆపేసి.. ఒంటరిగా పోటీచేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి పిట్ట రాంరెడ్డి తెలిపారు.
'మరో రెండు మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకు వస్తామని తెలిపారు. అలాగే పార్టీ గుర్తు కోసం దరఖాస్తు చేశామని.. రైతు నాగలి వస్తుంది.' -పిట్ట రాంరెడ్డి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పార్టీ అధికార ప్రతినిధి
ఇటీవలే వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో దిల్లీలో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించినట్లు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. అయితే వారి నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో.. ఇప్పుడు ఒంటరిగా బరిలో దిగుతున్నారు.
YS Sharmila Tweet on KCR : కేసీఆర్‌కు షర్మిల సవాల్.. దమ్ముంటే సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వండి..