ఏపీలోని నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైకాపా విజయ ఢంకా మోగించింది. మొత్తం 54 డివిజన్లను గెలుచుకుని.. క్లీన్‌స్వీప్ చేసింది (Nellore municipal corporation election). ఇందులో 8 డివిజన్లు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికలు జరిగిన 46 డివిజన్లల్లోనూ.. వైకాపా గెలిచి ప్రభంజనం సృష్టించింది. నగరపాలక సంస్థపై ఆ పార్టీ జెండా ఎగరవేయటంలో మంత్రి అనిల్ కుమార్, గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వైకాపా విజయం సాధించటంతో నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునిగిపోయారు.
డివిజన్ల వారిగా ఫలితాలు..
- 1వ డివిజన్ – జానా నాగరాజు
- 2వ డివిజన్ – పడిగినేటి రామ్మోహన్
- 3వ డివిజన్ – సంక్రాంతి అశ్విని
- 4వ డివిజన్ – పోలంరెడ్డి లక్ష్మీ ప్రత్యూష
- 5వ డివిజన్ – ఓ. రవిచంద్ర
- 6 వ డివిజన్ – మద్దినేని మస్తానమ్మ
- 7 వ డివిజన్ – కిన్నెర మాల్యాద్రి ( ఏక గ్రీవం )
- 8వ డివిజన్ – మొగళ్లపల్లి కామాక్షి ( ఏక గ్రీవం )
- 9 వ డివిజన్ – దామవరపు రాజశేఖర్
- 10 వ డివిజన్ – కిన్నెర ప్రేమ్ కుమార్
- 11 వ డివిజన్ – గోతం అరుణ
- 12 వ డివిజన్ – పొట్లూరి శ్రవంతి ( ఏక గ్రీవం )
- 13 వ డివిజన్ – ఊటుకూరు నాగార్జున
- 14 వ డివిజన్ – కర్తం ప్రతాప్ రెడ్డి
- 15 వ డివిజన్ – గణేశం సుజాత
- 16 వ డివిజన్ – వేనాటి శ్రీకాంత్ రెడ్డి
- 17 వ డివిజన్ – పేనేటి సుధాకర్
- 18 వ డివిజన్ – తోటకూర అశోక్ కుమార్
- 19 వ డివిజన్ – మారంరెడ్డి జ్యోతిప్రియ
- 20 వ డివిజన్ – చేజర్ల మహేష్ ( ఏక గ్రీవం )
- 21 వ డివిజన్ – మొయిళ్ల గౌరి
- 22 వ డివిజన్ – మూలే విజయ భాస్కర్ రెడ్డి
- 23 వ డివిజన్ – దుద్దుగుంట శ్రీనివాసులు రెడ్డి
- 24వ డివిజన్ – అరవ శాంతి ( ఏక గ్రీవం )
- 25 వ డివిజన్ – బద్దెపూడి నరసింహ గిరి
- 26 వ డివిజన్ – బూడిద సుప్రజ
- 27 వ డివిజన్ – భీమినేని మురహరి
- 28 వ డివిజన్ – చక్కా అహల్య
- 29వ డివిజన్ – షేక్ సత్తార్
- 30 వ డివిజన్ – కూకటి ప్రసాద్ రావు
- 31 వ డివిజన్ – బత్తల మంజుల
- 32 వ డివిజన్ – తాళ్లూరు అవినాష్
- 33 వ డివిజన్ – కరణం మంజుల
- 34 వ డివిజన్ – షేక్ ఫమీదా
- 35 వ డివిజన్ – యాకసిరి వసంతి
- 36 వ డివిజన్ – పిండి శాంతిశ్రీ
- 37 వ డివిజన్ – బొబ్బల శ్రీనివాస యాదవ్ ( ఏక గ్రీవం )
- 38వ డివిజన్ – దాసరి అమృత ( ఏక గ్రీవం )
- 39 వ డివిజన్ – సన్ను నాగమణి
- 40వ డివిజన్ – పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ( ఏక గ్రీవం )
- 41వ డివిజన్ – కువ్వకోలు విజయలక్ష్మి
- 42వ డివిజన్ – షేక్ కరీముల్లా
- 43వ డివిజన్ – మహ్మద్ ఖలీల్ అహ్మద్
- 44వ డివిజన్ – నీలి రాఘవ రావు
- 45వ డివిజన్ – ముదిరెడ్డి వేదవతమ్మ
- 46వ డివిజన్ – వేలూరు ఉమా మహేష్
- 47వ డివిజన్ – పొట్లూరి రామకృష్ణ
- 48వ డివిజన్ – సయ్యద్ తహసీన్
- 49వ డివిజన్ – వందవాసి రాజేశ్వరి
- 50వ డివిజన్ – గుంజి జయలక్ష్మి
- 51వ డివిజన్ – కాయల సాహిత్య
- 52వ డివిజన్ – షేక్ అస్మ
- 53వ డివిజన్ – దేవరకొండ సుజాత
- 54వ డివిజన్ – షేక్ సోఫియా బేగం
ఈ నెల 22న నెల్లూరు నగర మేయర్, ఇద్దరు ఉప మేయర్లు, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో అధికార వైకాపా.. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. కీలకమైన కుప్పం మున్సిపాలిటిలోనూ ఫ్యాన్ పార్టీ పాగా వేసింది. రాజంపేట, గురజాల, దాచేపల్లి, కమలాపురం, ఆకివీడు, పెనుకొండ, బేతంచర్లలో వైకాపా విజయ దుందుభి మోగించింది. ప్రకాశం జిల్లా దర్శి మాత్రం.. తెదేపా ఖాతాలోకి చేరింది.
ఇదీ చూడండి: Harish Rao Review: వీలైనంత త్వరగా పూర్తి చేయాలి: హరీశ్ రావు