రైతుల మోములో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని మూడు పథకాలకు సంబంధించిన నిధులు విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్(cm jagan) అన్నారు. వైఎస్సార్ రైతు భరోసా(rythu bharosa)- పీఎం కిసాన్(pm kisan), వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ యంత్ర సేవా పథకాలకు సంబంధించిన నిధులను ఆయన విడుదల చేశారు.
మూడో ఏడాది రైతు భరోసా కింద.. 50.37 లక్షల మంది రైతులకు రూ.2051.71కోట్లు ఇచ్చామన్న సీఎం.. ఇప్పటివరకు రూ.18,777 కోట్లు ఇవ్వగలిగామని అన్నారు. అటవీ, దేవదాయ భూములు సాగు చేసుకుంటున్న వారికి రైతు భరోసా వర్తింపజేసినట్లు చెప్పారు. లక్షలోపు పంట రుణం తీసుకుని సకాలంలో చెల్లించినవారికి.. వైఎస్సార్ సున్నా వడ్డీ వర్తిస్తుందని తెలిపారు. రైతులకు సున్నా వడ్డీ కింద రూ.112.70 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు.
బ్యాంకింగ్ సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీకేలలో బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించినట్లు వివరించారు. 1720 రైతు సంఘాలకు వ్యవసాయ పరికరాల కొనుగోలుకు.. యంత్ర సేవా పథకం కింద రూ. 25.55 కోట్లు నిధులు విడుదల చేశామన్నారు. ఆర్బీకేలకు అనుబంధంగా 10,750 కమ్యూనిటీ హైరింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్న సీఎం.. ధాన్యం సేకరణ కోసం దాదాపు రూ.36 వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. కరోనా సవాల్ విసిరినా రైతుల పట్ల బాధ్యతగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.
ఇదీ చూడండి: Ap Government: కొవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం..!