ETV Bharat / state

బంగారు తెలంగాణను కేసీఆర్‌ అప్పులపాలు చేశారని షర్మిల ఫైర్ - అరుణపై షర్మిల మండిపాటు

జోగులాంబ గద్వాల జిల్లాలో వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్ర 131వరోజు కొనసాగుతుంది. కేసీఆర్‌ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని ఆరోపించారు. ప్రజలకిచ్చిన ఏఒక్క హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని షర్మిల మండిపడ్డారు.

ys sharmila fires on cm kcr in gadwal district

author img

By

Published : Aug 24, 2022, 3:33 PM IST

బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఎద్దేవా చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కొనసాగుతున్న ప్రజాప్రస్థానం యాత్ర 131వరోజుకు చేరుకుంది. గద్వాల పట్టణం జమ్మిచెడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర వీరాపురం, శివపురం, అనంతపురం మీదుగా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తా వరకు కొనసాగనుంది. ప్రజలకిచ్చిన ఏఒక్క హామీని ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని షర్మిల మండిపడ్డారు.

వైఎస్ఆర్ మంత్రి పదవి ఇస్తేనే కదా డీకే అరుణమ్మకు రాజకీయ భవిష్యత్తు వచ్చింది. వైఎస్ఆర్ తర్వాత ఇన్నేండ్లుగా రాజకీయాల్లో ఉండి, గద్వాలకు డీకే అరుణమ్మ ఏం చేశారు? కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అమిత్ షా చెప్పడం కాదు.. మీకు దమ్ముంటే, ప్రజాధనం పట్ల చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ ఎంక్వైరీ చేయించండి. - వైఎస్ షర్మిల, వైతెపా అధ్యక్షురాలు

కేసీఆర్‌ బంగారు తెలంగాణను అప్పులపాలు చేశారని షర్మిల ఫైర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.