హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న చాలా మున్సిపాలిటీలు, నగరపాలకసంస్థలు అభివృద్ధికి మాత్రం చాలా దూరంగా ఉన్నాయి. ఈ దుస్థితికి ప్రధాన కారణం... ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం... ఆ తర్వాత విస్మరించటమేనని యువత భావన. ఈసారి మాత్రం ఎవరైతే అభివృద్ధి, రక్షణకు పెద్ద పీఠ వేస్తారో వారికే పట్టం కడుతామంటున్నారు యువకులు.
భద్రత కల్పిస్తేనే ధైర్యం...
భాగ్యనగర శివారులో ఉన్న పురపాలికల్లో ఎక్కువశాతం ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు నివాసముంటున్నారు. రాత్రి వేళల్లోనూ విధులు నిర్వర్తించే ఉద్యోగులు ఎక్కువగానే ఉంటారు. ఈ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, రోడ్లు, వీధి దీపాలు, మంచినీటి వసతులతో పాటు పోలీసుల నిఘా పెంచాలని ఆయా ప్రాంతవాసులు కోరుకుంటున్నారు. ఆ దిశగా ప్రజాప్రతినిధులు ఆలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సరైన నాయకున్ని ఎన్నుకునేలా...
ప్రస్తుతం జరగనున్న పురపాలక సంఘ, నగరపాలక సంఘ ఎన్నికల్లో సరాసరి 40శాతం మంది యువ ఓటర్లు ఉన్నారు. వీళ్లంతా ఇంటింటికి తిరిగి ఓటు విలువ తెలియజేశారు. ఎటువంటి వారికి ఓటేయాలో అవగాహన కల్పించారు. అభివృద్ధి కల్పించే వారిని ఎన్నుకోవాలని ఓటర్లను చైతన్యపరిచారు.
యువతపై నేతల దృష్టి...
ప్రజాప్రతినిధులు సైతం యువతను ఆకట్టుకునేందుకు ప్రచార పర్వంలో తీవ్రంగా ప్రయత్నించారు. యువతకు కావాల్సిన క్రీడాస్థలాలు, జిమ్‌లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల వంటి అంశాలను ప్రస్తావించారు. ఏది ఏమైనా... ఈసారి ఎన్నికల్లో యువత ఓట్లే తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
బస్తీమే సవాల్: కాలం మారింది..సెల్‌ఫోన్‌తో ఇస్మార్ట్ ప్రచారం..