హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని హుడా కాలనీలో స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో వివేకానంద విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ హోదాలో తాను ఈ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని దత్తాత్రేయ పేర్కొన్నారు. యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడలలో నడవాలని సూచించారు. వేదికపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కుప్పకూలిన వెదురు వంతెన.. భక్తులు క్షేమం