ETV Bharat / state

ఒకరిపై ప్రేమ.. మరొకరిపై జాలి.. చివరికి ఏమైందంటే? - manasulo mata

మనసు నిండా ఒకరు.. దయతో కలిగిన జాలి వల్ల ఇంకొకరు! నా హృదయాన్ని వాళ్లిద్దరూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు... అంటున్నాడు ఓ యువకుడు. తన ప్రేమకథకు తానే విలన్​ అంటున్న యువకుడి స్టోరీ ఓ సారి చదివేద్దామా...?

YOUNG MAN LOVE STORY SPECIAL STORY
ప్రేమకి, జాలికి మధ్య నలిగిన ఓ యువకుడి కథ.. ఏమైందంటే..?
author img

By

Published : Jun 3, 2020, 5:06 PM IST

Updated : Jun 3, 2020, 6:56 PM IST

ఆమె.. నాకు కాబోయే అర్ధాంగి’ అని నా పెదాలు పలికాయి. ‘మరి నేను ఎవరు?’ అని గీత సంధించిన ఆ ప్రశ్న సూటిగా నా గుండెను తాకింది. ‘ఆమెనే పెళ్లాడబోతున్న నీవు మరి నాతో తీయటి కబుర్లు ఎందుకు చెప్పావ్‌? నన్ను ఎందుకు ప్రేమ.. ప్రేమ అంటూ మోసం చేశావ్‌?!’ అని ఆమె కంఠం నన్ను కాలర్‌ పట్టుకు నిలదీసింది. జీవితంలో తొలిసారి తలదించుకుని నేల చూపులు చూశా. ‘అది కాదు గీతా.. మరి నువ్వు నా ప్రపోజల్‌ను ఓకే చేయలేదు కదా.. అందుకే భర్తను కోల్పోయిన ఆమెకు ఓ తోడుగా నిలవాలని అనుకుంటున్నా’ అని నా సమాధానం. ‘ఎవరన్నారు.. నీ ప్రపోజల్‌ నేను ఓకే చేయలేదని. నేను నో చెప్పానా?’ ఆమె కళ్లల్లో తెరలా సన్నటి కన్నీటి ధార. ‘ఫ్రెండ్స్‌లా ఉందాం అన్నావ్‌ కదా గీత. అంటే నో చెప్పినట్లే అనుకున్నా’. ‘ఛీ పోరా! నీకు అసలు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు! అడగ్గానే ఎవరైనా ఒప్పేసుకుంటారా?! ఒప్పుకొనేలా అడగాలి. ఒప్పుకొనే దాకా అడగాలి! కానీ ఇవేమీ చేయకుండా.. గీతా ఐ లవ్‌ యూ అన్నావ్‌. నేను జస్ట్‌ ఫ్రెండ్స్‌ అన్నాను. అలా అనగానే తలూపావు.. మళ్లీ మునుపటిలానే నన్ను నవ్వించావ్‌.. కవ్వించావ్‌... ఇప్పుడేమో మరొకరితో పెళ్లి అంటున్నావ్‌. మరి నా పరిస్థితి ఏంటి? ఒరేయ్‌.. ఇప్పుడు చెబుతున్నారా ఐ లవ్‌ యూ! నువ్వు లేకుండా నేను లేను.’ అనే సరికి నాకేం అర్థం కాలేదు.

సారీ గీతా.. నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ. అదంతా గతం. నువ్వు ‘జస్ట్‌ ఫ్రెండ్స్‌’ అన్నావ్‌. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. అప్పుడే నా ప్రేమను చంపుకొన్నా. అదే సమయంలో మా బంధువుల అమ్మాయి పరిచయమైంది. ఆమెకు ఇది వరకే పెళ్లైంది.. ఓ పాప. పాపం భర్త ఏదో ప్రమాదంలో చనిపోయాడు. తనకి జీవితం ఇవ్వాలని అనిపించింది. అందుకే నా అభిప్రాయాన్ని మా అమ్మకు చెప్పా. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే మా పెళ్లి. ఇంతకు మించి నేను ఏమీ చేయలేను.. చెప్పలేను’ అని గీతకు తేల్చి చెప్పా.‘... అసలు ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు. పిచ్చోడా నువ్వు లేకుండా నేను ఉండలేనురా. ప్రేమ ప్రేమ.. అంటూ నువ్వు చదువును ఎక్కడ పక్కన పడేస్తావో అని.. జస్ట్‌ ఫ్రెండ్స్‌ అని చెప్పా. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నారా. నువ్వు లేకుండా ఉండలేను. ’ నా గీత గొంతు వణికింది. నా జీవితం ఆ ఇద్దరి మధ్య నిండు కుండలా తొణికింది. కుండ పగల్లేదుగానీ.. కాలం మాత్రం వేగంగా కరిగిపోయింది. ఇప్పుడు అదంతా గతం! ఇది వర్తమానం. ఇప్పుడు నా జీవితంలో ఆ స్త్రీ లేదు. నా గీత కూడా లేదు! నేను ఎవరిపైన అయితే జాలి చూపానో.. ఎవరికైతే కొత్త జీవితాన్ని ఇద్దామనుకున్నానో.. ఎవరి కోసమైతే నా ప్రేమనూ త్యాగం చేశానో.. ఆమె నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆమెకు నా అవసరమే మొదట్లో నాకు ప్రేమలా కనిపించింది. కానీ రాను రానూ మబ్బులు తొలగాయి. ఇదే అదనుగా మా ఇద్దరి మధ్య బంధువులే మరిన్ని విషబీజాలు నాటారు. లేనిపోని చాడీలు చెప్పి ఆమె మనసును మరింత విరగ్గొట్టారు. ‘నీతో పెళ్లి నాకు ఇష్టం లేదు. ప్లీజ్‌ వద్దు. నీకు ఉద్యోగం లేదు. మీ వాళ్లకు పెద్దగా ఆస్తిపాస్తులూ లేవు. నువ్వు నా అంత అందంగానూ లేవు. నువ్వు నా పక్కన నిల్చుంటే మన ఇద్దరి జంట చూడటానికీ అంత బాగోదు.’ అని చెప్పింది. నా గుండె పగిలింది! ‘నీ కోసమే కదా.. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా గీతను గతం చేసుకున్నా! అని మౌనంగా ప్రశ్నించా?’ ‘సారీ.. ఇన్నాళ్లు నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించు. ఇంకెప్పుడూ నీకు ఎదురు కాను.’ అని చెప్పి ఆమె నుంచి కన్నీటి ప్రవాహంతో సెలయేళ్లైన కళ్లతో సెలవు తీసుకున్నా.

గీత గుర్తుకొచ్చింది. కానీ మళ్లీ తన జీవితంలోకి వెళ్లడానికి నాకు మనసొప్పలేదు. అయినా.. తను ఫోన్‌లో మాట్లాడేది. ‘నిన్ను చూడాలని ఉంది.. రమ్మంది.’ ఎందుకో నేను వెళ్లలేదు. వెళ్లాలనిపించలేదు. తను ఎన్నో సార్లు అడిగింది. నేను నో అనలేదు. అలాగని కలవలేదు. మా ఇద్దరి మధ్య ఫోన్లు తగ్గాయి. కొద్దిరోజులకు గీతకు పెళ్లైపోయింది. ఇప్పుడు తను నా గుండె లోతుల్లో ఓ జ్ఞాపకంలా మిగిలిపోయింది. నిజానికి నేను ఆమెను అప్పుడే చేరుకోవచ్చు. నా జీవితభాగస్వామిగా చేసుకోవచ్చు. కానీ ఆమె మనసులో ఓ మచ్చ మిగిలే ఉంటుంది. ఏ ఆప్షన్‌ లేక తన దగ్గరకి వచ్చానని తను అనుకోవచ్చు. తను బయటకు అనకున్నా.. ఆమె దృష్టిలో జీవితంలో ఒక్క క్షణమైనా నేను నీచంగా కనిపిస్తానేమో! అది నాకు ఇష్టం లేదు. అందుకే ఆమెకు దూరంగా.. ఆమె గురించిన ఆలోచనలకు దగ్గరగా జరిగా! కాలం ఒడిలో ఒరిగా. నేను చెప్పేది ఒక్కటే.. ప్రేమ వేరు.. జాలి వేరు. మనం ప్రేమను చూపిస్తే ప్రేమను పొందొచ్చు. జాలి చూపితే.. జాలి దొరక్కపోవచ్చు! నేను జీవితంలో ఓడిపోయా. కానీ ప్రేమను మాత్రం ఓడిపోకుండా చూశా!! జీవితాంతం గతాన్ని తలుచుకుంటూ బాధ పడను. గీతను తలుచుకుంటూ ముందుకెళతా. ఇప్పుడు నా కుటుంబం నాది. తన కుటుంబం తనది. కానీ ఇప్పటికీ.. ఎప్పటికీ.. తను నా జ్ఞాపకం. అను నిత్యం ఆమె నామ జపమే నా వ్యాపకం. కారణం.. నా కంటి‘పాప’కు ఆమె పేరే పెట్టుకున్నా. నేను చేసింది తప్పో.. ఒప్పో.. నాకు తెలియదు. చేశానంతే!! నా ప్రేమలో ఎవరూ విలన్లు లేరు. నా ప్రేమకు నేనే విలన్‌.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ బద్దకాన్ని వదిలించుకోండిలా...

Last Updated : Jun 3, 2020, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.