హైదరాబాద్‌లోని కూకట్పల్లి దయారుగూడలో రాజా అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసి తన స్నేహితులకు పంపినట్టు సమాచారం. జీవితంలో విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో తెలిపాడు. ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్న రాజా.. తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ వాసి అని తెలిసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. యూసఫ్‌గూడలోని మృతుని సోదరుడు చంద్రశేఖర్‌కు ఈ విషయాన్ని తెలిపారు. తమ ఊరిలో ఆస్తి తగాదాలు జరుగుతున్నాయని... తన సోదరుడు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య..