ETV Bharat / state

ఈ నెల 20న 'మిలీనియం డిక్లరేషన్​ ర్యాలీ'

దేశవ్యాప్తంగా ప్రజల్లో సీఏఏ, ఎన్​ఆర్​సీ, ఎన్​ఆర్​పీలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యంగ్​ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 20న హైదరాబాద్​లో డిక్లరేషన్​ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు జేఎన్​యూ విద్యార్థి యూనియన్​ మాజీ అధ్యక్షుడు బాలాజీ తెలిపారు.

Young_India_Aganist_Caa_Nrc
ఈ నెల 20న యంగ్​ఇండియా 'మిలీనియం డిక్లరేషన్​ ర్యాలీ'
author img

By

Published : Jan 11, 2020, 5:09 PM IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సీఏఏ, ఎన్‌ఆర్​సీ, ఎన్‌ఆర్‌పీ అంటే ఏమిటి?... వాటి వల్ల జరిగే నష్టం ఏమిటీ అనే విషయాల్లో దేశవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యంగ్‌ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని... దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడు అని జేఎన్‌యూ విద్యార్థి యూనియన్‌ మాజీ అధ్యక్షుడు బాలాజీ అన్నారు. భారతీయులుగా పుట్టిన మనం మరోమారు భారతీయులుగా నిరూపించుకోవల్సిన అవసరం లేదన్నారు.

ఈనెల 20వ తేదీ హైదరాబాద్‌లో యంగ్‌ ఇండియా మిలీనియం డిక్లరేషన్‌ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ట్యాంక్​బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌ షాలు మతం పేరిట ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తున్నారని మండిపడ్డారు.

ఈ నెల 20న యంగ్​ఇండియా 'మిలీనియం డిక్లరేషన్​ ర్యాలీ'

ఇవీ చూడండి: సీఏఏపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారాలు: షా

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.