తరచూ ఫోన్ మాట్లాడుతోందని... తల్లి మందలించడం వల్ల యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ జీడిమెట్ల ఠాణా పరిధిలో జరిగింది. భగత్‌సింగ్‌నగర్ సమీపంలోని కాలనీకి చెందిన మహిళ జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలు. భర్త మృతిచెందినప్పటి నుంచి కుమార్తె శ్రావణి, కుమారుడుతో కలిసి జీడిమెట్లలోని ఆమె తన సోదరుడి ఇంట్లో ఉంటోంది. శ్రావణి సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో చిన్నపిల్లలను ఆడించే కేర్ టేకర్‌గా పనిచేస్తుంది.
అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న యువకుడితో తరచూ ఫోన్‌లో మాట్లాడుతోంది. రెండు రోజుల క్రితం విధులకు వెళ్లకుండా అతడి జన్మదిన వేడుకలకు వెళ్లింది. ఈ విషయం తెలిసి తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం కుమారుడు లేచి చూసేసరికి యువతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించింది. స్థానికులు తల్లికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.