ETV Bharat / state

'విద్యుత్ సమస్యలపై ఫోరంను ఆశ్రయించవచ్చు'

గ్రేటర్‌లో నిరంతర విద్యుత్తు సరఫరా అందుతున్నా.. సేవా లోపాలు వినియోగదారులను వేధిస్తున్నాయి. వీటిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా చాలాసార్లు సరైన స్పందన ఉండటం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్తు వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్‌ఎఫ్‌)-2ను ఆశ్రయించవచ్చని ఛైర్మన్‌ ఎన్‌.జయరాజ్‌ పేర్కొన్నారు. 2018 అక్టోబరులో న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన ఆయన.. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి కేసులను సత్వరం పరిష్కరిస్తున్నారనే గుర్తింపు పొందారు. పది నెలల వ్యవధిలో 129 ఫిర్యాదులు వస్తే.. 120 కేసుల్లో ఆర్డర్లు పాస్‌ చేశారు. ఫోరంను ఆశ్రయిస్తే వినియోగదారులకు న్యాయం జరుగుతుందనే భరోసా పెంచారు. ఈ సందర్భంగా విశ్రాంత న్యాయమూర్తి, సీజీఆర్‌ఫ్‌ ఛైర్మన్‌ జయరాజ్‌తో ‘ఈనాడు’ ముఖాముఖి...

You can approach the forum on power issues: N. Jayaraj
విద్యుత్ సమస్యలపై ఫోరంను ఆశ్రయించవచ్చు: ఎన్‌.జయరాజ్‌
author img

By

Published : Mar 12, 2021, 9:44 AM IST

  • మీరు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కొవిడ్‌ మహమ్మారి ఉంది. బహిరంగ విచారణలు జరుగుతున్నాయా?

నేను 2020 ఏప్రిల్‌లో ఛైర్మన్‌గా బాద్యతలు చేపట్టాను. కొవిడ్‌ ఉదృత్ధంగా ఉన్న రోజులవి.. కోర్టులే పూర్థి స్తాయిలో పనిచేయ లేదు. ఇంకా ఆన్‌లైన్‌లోనే ఎక్కువగా విచారిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సీజీఆర్‌ఎఫ్‌-2 ప్రతినెల బహిరంగ విచారణలు నిర్వహించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించింది. 33 ప్రాంతాల్లో బహిరంగ విచారణలు చేపట్టాం. ప్రతి నెలా ముందే పర్యటన షెడ్యూల్‌ ప్రకటించి.. ఆయా విద్యుత్తు సెక్షన్ల పరిధిలో ఫిర్యాదులను స్వీకరిస్తున్నాం. కాగితంపై రాసిచ్చినా ఫిర్యాదు తీసుకుంటాం. కార్యాలయ చిరునామాకు పోస్టులో, ఫాక్స్‌లో, ఈ మెయిల్‌లోనూ ఫిర్యాదు పంపవచ్ఛు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన పనిలేదు.

  • పది నెలల వ్యవధిలో ఎన్ని ఫిర్యాదులు అందాయి? వాటి ప్రస్తుత స్థితి?

ఏప్రిల్‌ నుంచి 129 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 120 కేసుల్లో ఆర్డర్లు పాస్‌ చేశాం. మిగిలినవి విచారణలో ఉన్నాయి. 2003 విద్యుత్తు చట్టం, ఈఆర్‌సీ మార్గదర్శకాల మేరకు విచారించి సాధ్యమైనంత వరకు వినియోగదారులకు న్యాయం చేస్తున్నాం. 73 కేసుల్లో వినియోగదారులకు అనుకూలంగానే ఆర్డర్లు ఇచ్చాం. సాధారణంగా ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పరిష్కారానికి 45 రోజుల గడువు ఉంటుంది. అంత సమయం తీసుకోకుండా ఎప్పటివప్పుడే విచారిస్తున్నాం.

  • సీజీఎఫ్‌ఆర్‌ఎఫ్‌ ఆదేశాలు అమలు చేయకపోతే సిబ్బందిపై జరిమానాలు విధించొచ్చు అని చట్టంలో ఉంది. ఎంతమందికి జరిమానా వేశారు?

సీజీఆర్‌ఎఫ్‌ ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే వినియోగదారులు విద్యుత్తు అంబుడ్స్‌మన్‌కు అప్పీల్‌ చేయవచ్ఛు అక్కడ న్యాయం జరగలేదని అనిపిస్తే హైకోర్టులో అప్పీలు చేసుకోవచ్ఛు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ అధికారులైతే నేరుగా హైకోర్టులో సవాల్‌ చేయవచ్ఛు ఆదేశాలను వారు కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఒక కేసులో అధికారులపై రూ. 8250 జరిమానా వేసి కట్టించాం కూడా. వినియోగదారులకు కేసులను బట్టి నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తుంటాం.

  • ఈ వేదికపై వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపడుతున్నారా?

విద్యుత్తు నియంత్రణ మండలి ఇప్పటికే టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు దీనిపై ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత విద్యుత్తు కార్యాలయాలు, వినియోగదారుల సేవా కేంద్రాల్లో సీజీఆర్‌ఫ్‌-2పై బోర్డులు ఏర్పాటు చేయాలనే ఆదేశాలున్నాయి. మేము కూడా ప్రతినెల ఒక్కో ప్రాంతానికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. ఈ విషయంపై సంబంధిత సెక్షన్‌ అధికారులు విస్తృత ప్రచారం చేపట్టాల్సి ఉంటుంది. నాణ్యమైన సేవలు కోరుకోవడం వినియోగదారుల హక్కు. అవగాహన పెంచుకుని హక్కులను సాధించుకోవాలి. కరెంట్‌ సమస్యలపై నగర పరిధిలోని వినియోగదారులు సీజీఆర్‌ఎఫ్‌-2ను ఆశ్రయించవచ్ఛు

  • ఏయే సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు?

విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, విద్యుత్తు హెచ్చుతగ్గులు, మీటరు సమస్యలు, కొత్త కనెక్షన్‌ జారీ, పేరు, సర్వీస్‌ కేటగిరి మార్పు, విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ, ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి కనెక్షన్‌ మార్చడం, అధిక బిల్లులు, వినియోగదారుల సేవల పట్టిక అమలులో జాప్యంతో సహా విద్యుత్తు సేవా లోపాలపై సీజీఆర్‌ఎఫ్‌కు ఫిర్యాదు చేయవచ్ఛు వీటిపై విచారణ నిర్వహించి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నాం. ఛైర్మన్‌గా నేను, ముగ్గురు సభ్యులు ఉంటారు. ఫైనాన్స్‌, టెక్నికల్‌ సభ్యులతో పాటు ఒకరు స్వతంత్య్ర సభ్యుడు విచారణలో పాల్గొంటారు. ఆదేశాలను ఎప్పటికప్పుడు టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నాం.

2020-21 ఆర్థిక సంవత్సరంలో కేసులిలా..

  • 129 వచ్చిన ఫిర్యాదులు
  • 120 ఆర్డర్లు ఇచ్చినవి
  • 73 వినియోగదారులకు అనుకూలంగా
  • 33 పది నెలల వ్యవధిలో బహిరంగ విచారణలు

ఫిర్యాదు చేయాల్సిన చిరునామా

ఛైర్మన్‌, సీజీఆర్‌ఎఫ్‌-2, ఇంటి నెంబరు: 8-3-167/ఇ/1, సెంట్రల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, జీఎస్‌టీ కాలనీ, వెంగళ్‌రావునగర్‌, ఎర్రగడ్డ, హైదరాబాద్‌ 5000045. ఫొన్‌: 040-23431228, 23431146

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.