ETV Bharat / state

నోటీసుపై సీఈసీకి వివరణ ఇచ్చిన రఘురామకృష్ణరాజు

author img

By

Published : Jun 26, 2020, 5:48 PM IST

Updated : Jun 26, 2020, 6:34 PM IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఈసీ అధికారులతో సమావేశమయ్యారు. పార్టీపై బహిరంగ ఆరోపణలు చేశారన్న ఆరోపణలపై తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్​ నోటీసుపై ఆయన అధికారులతో గంటన్నర పాటు చర్చించారు.

mp raghurama krishnam raju
mp raghurama krishnam raju

కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. తనకు పార్టీ ఇచ్చిన షోకాజ్​ నోటీసు చెల్లుబాటు అంశంపై ఆయన చర్చించారు. అసలు పార్టీ పేరు, షోకాజ్​ నోటీసుపై పేర్కొన్న పార్టీ మధ్య వ్యత్యాసంపై ఆరా తీశారు. దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం సాగింది.

సభ్యులెవరో చెప్పండి..!

వైకాపా క్రమశిక్షణ కమిటీ, దాని సభ్యులు ఎవరో చెప్పాలని.. దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని.. ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కోరారు. పార్టీ సభ్యుడికి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ పోతుందా.. అలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా.. అని ఎంపీ వారిని అడిగారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. ఈ తరహా కేసులను తొలిసారి చూస్తున్నట్లు ఎంపీతో చెప్పారు. ఈ సమాచారం మంగళవారంలోగా ఇస్తామని తెలిపారు. అయితే సంబంధిత అధికారి లేకపోవడం వల్ల ఎంపీ రఘురామకృష్ణరాజు.. మరోసారి ఈసీ అధికారులను కలవనున్నారు.

ఇదీ జరిగింది..!

ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేశారన్న ఆరోపణలపై రఘురామకృష్ణరాజుకు వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. అయితే తనకు షోకాజ్​ నోటీసు ఇచ్చే అధికారం విజయసాయిరెడ్డికి అసలు ఉందా? లేదా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. తనకు వైఎస్​ఆర్​ కాంగ్రెస్​ పార్టీ అనే లెటర్​ హెడ్​పై లేఖ పంపారని.. మనది రాష్ట్ర పార్టీ అయితే విజయసాయి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా అయ్యారని ప్రశ్నించారు. ఈసీ గుర్తింపు పొందిన క్రమశిక్షణ కమిటీ మన పార్టీకి ఉందా అని రఘురామకృష్ణరాజు నిలదీశారు.

ఇదీ చదవండి: జిల్లాలో ఒక్క రోజే 1.15 లక్షల మొక్కలు నాటాం: కేటీఆర్​

Last Updated : Jun 26, 2020, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.