మూడు రాజధానులపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వుల విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురుకాక తప్పదని వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.
ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలిని తప్పుబట్టిన రఘురామకృష్ణరాజు.. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.