MLA Anam Sensation Comments: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటున్నారు.. అవే వస్తే తామంతా ముందే ఇంటికి వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సైదాపురం మండలంలో సచివాలయాల నిర్మాణాలు సరిగా జరగడం లేదని మండిపడ్డారు. ‘‘ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి నాలుగేళ్లు అవుతోంది. ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇందుకు సాంకేతిక కారణాలా? బిల్లుల చెల్లింపులో జాప్యమా? తెలియడం లేదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి