ఏపీలోని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి వద్ద కోట్ల రూపాయల విలువైన ఆర్అండ్ బీ స్థలం కబ్జాకు గురైంది. ఆ స్థలాన్ని స్థానిక వైకాపా నేత ఓబుల్ రెడ్డి అమ్మేస్తున్నాడు. వైకాపా ప్రభుత్వం వచ్చాక ఆ స్థలంలో రాత్రికి రాత్రే అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి.
విషయం తెలుసుకున్న అధికారులు, మీడియాతో కలిసి అక్కడకు వెళ్లగా... తన జోలికి వస్తే.. శవాలు లేస్తాయని... మంత్రికి చెప్పే ఇదంతా చేస్తున్నట్లు ఓబుల్ రెడ్డి చెప్పుకొచ్చాడు. అక్కడకు వెళ్లిన అధికారులపై దాడికి యత్నించాడు. ఎలాగోలా.. అధికారులు అక్రమ కట్టడాలు కూల్చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 1610 కరోనా పాజిటివ్ కేసులు