హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనం ఎదుట యాదాద్రి భువనగిరి జిల్లా మల్కాపూర్‌కు చెందిన గిరిజన రైతులు ధర్నా చేశారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని వెనక్కి ఇచ్చేయాలంటూ అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
1983 నుంచి 2005 వరకు వివిధ దఫాల్లో ప్రభుత్వం భూములు పంపిణీ చేసిందని అన్నదాతలు పేర్కొన్నారు. వాటికి పట్టాలు సైతం జారీ చేశారని వెల్లడించారు. అయినా ఆ భూములు అటవీ శాఖవేనని అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వాపోయారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు బాధితులు వెల్లడించారు.
ఇదీ చూడండి: ఇప్పటి వరకు 70 లక్షల సభ్యత్వాలు వచ్చాయి: కేటీఆర్