ప్రపంచ పొగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా... డాక్టర్ రావుస్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ హైదరాబాద్‌లో అవగాహన సదస్సు నిర్వహించింది. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పొగతాగడం వల్ల జరిగే అనర్థాలను డాక్టర్ రావు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ స్పందించి హైదరాబాద్‌ని ధూమపాన రహిత నగరంగా చేయాలని సంకల్పించడం అభినందనీయమన్నారు. టొబాకో ఉత్పత్తి పదార్థాలు ఏ రకంగా తీసుకున్నా... అనేక రోగాలు వస్తాయని తెలిపారు. ఒకసారి తాగితే ఏమవుద్ది ఓసారి రుచి చూద్దాం అనకుంటూ మొదలు పెట్టిన వారు పొగాకును వ్యసనంగా చేసుకుంటున్నారని దాని వల్ల క్యాన్సర్ బారిన పడుతున్నారని హెచ్చరించారు. గత 35 ఏళ్లుగా తమ ఫౌండేషన్ ద్వారా పొగాకు తాగడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు రావు తెలిపారు.
ఇవీ చూడండి: బధిర బాలుడైనా... బహు కళాకోవిదుడు