సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో ఉన్న గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న శివాలీ జోహ్రి శ్రీవాస్తవ అనే విద్యార్థిని రంగు కాగితాలతో చిన్న పాటి బొమ్మలు తయారు చేసి 9 ప్రపంచ గిన్నిస్ రికార్డులను సొంత చేసుకుంది. అంతేకాదు.. పది అసిస్ట్ వరల్డ్ రికార్డులతో పాటు ఒక యూనిక్ వరల్డ్ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆమె తల్లి కవిత జోహ్రి, తండ్రి అనిల్ శ్రీవాస్తవతో కలిసి 6001 ఒరిగామీ వేల్స్, 2500 ఒరిగామీ పెంగ్విన్స్, 1451 ఒరిగామీ మప్లిలు తయారుచేసి ఒకేచోట ఉంచి ఈ కుటుంబం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శన రికార్డును నెలకొల్పింది.
తాజాగా సాధించిన 3 గిన్నిస్ రికార్డులు, గతంలో శివాలీ పేరిట ఉన్న 6 గిన్నిస్ రికార్డులతో కలుపుకుని 9 ప్రపంచ రికార్డులు ఆమె ఖాతాలో చేరాయి. హైదరాబాద్‌కు చెందిన వీరు 9 గిన్నిస్ రికార్డులు సాధించడం అరుదైన విశేషంగా పలువురు ప్రశంసిస్తున్నారు. శివాలీ దఫదఫాలుగా ఈ 9 గిన్నిస్ రికార్డు నెలకొల్పడం వల్ల విశ్వవిద్యాలయ యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తోంది.
ఇదీ చూడండి: ఐపీఎల్ 2020: ఉనద్కత్ హ్యాట్రిక్