ETV Bharat / state

చౌకధరలకే మందుల లభించేలా కృషి చేయండి - క్లినికల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్

హైదరాబాద్​ కూకట్​పల్లి జేఎన్​టీయూహెచ్​లో క్లినికల్ ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఈటల రాజేందర్​ హాజరయ్యారు. ఖరీదైన ఔషదాలు తక్కువ ధరకే లభించే విధంగా ఫార్మా విద్యార్థులు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ​

చౌకధరలకే మందుల లభించేలా కృషి చేయండి
author img

By

Published : Aug 17, 2019, 11:35 PM IST

వైద్య రంగంలో ఖరీదైన ఔషధాలను పేదలకు తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావల్సిన బాధ్యత ఫార్మసీ విద్యార్థులపై ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కూకట్‌పల్లి జేఎన్టీయూహెచ్​లో జరిగిన క్లినికల్ ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్ కాన్ఫరెన్స్​కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనం సాధించే విజయం ద్వారా సామాన్యుడికి లబ్ధి చేకూరితే దానిని మించిన ఆనందం మరొకటి ఉండదని అబ్దుల్​ కలాం అన్నారని గుర్తు చేశారు. నేడు పేదలకు వ్యాధులు సంభవించినప్పుడు ఖర్చులు భరించలేక ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఫార్మా విద్యార్థులపైన ఉందని పేర్కొన్నారు.

చౌకధరలకే మందుల లభించేలా కృషి చేయండి
ఇదీ చూడండి: కర్ణాటకకు ఉగ్రముప్పు​- భద్రత కట్టుదిట్టం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.