ETV Bharat / state

Women's Reservation Bill Effect on Telangana Politics : మహిళా రిజర్వేషన్ల బిల్లుతో సమూలంగా మారనున్న రాష్ట్ర రాజకీయ సమీకరణాలు - 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్

Women's Reservation Bill Effect on Telangana Politics 2023 : మహిళా రిజర్వేషన్ల బిల్లు అమల్లోకి వస్తే.. రాష్ట్ర రాజకీయ సమీకరణాలు సమూలంగా మారనున్నాయి. చట్టసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. శాసనసభలో 40 స్థానాలు.. రాష్ట్రం నుంచి ఆరు లోక్​సభ స్థానాలు మహిళలకు దక్కనున్నాయి. కేటాయింపు ఏ ప్రాతిపదికన చేస్తారన్న దానిపై నేతల భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

Women Reservation Bill Telangana 2023
Women Reservation Bill
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2023, 7:01 AM IST

Updated : Sep 19, 2023, 12:18 PM IST

Womens Reservation Bill Effect on Telangana Politics మహిళా రిజర్వేషన్ల బిల్లుతో సమూలంగా మారనున్న రాష్ట్ర రాజకీయ సమీకరణాలు

Women's Reservation Bill Effect on Telangana Politics 2023 : కేంద్ర మంత్రివర్గం ఆమోదంతో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మరో అడుగు ముందుకు పడినట్లైంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు(Women Reservation Bill) ఆమోదం పొంది చట్టబద్దత లభిస్తే చట్టసభల్లో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్(33 Percent Seats Reserve For Women) కానున్నాయి. ఆ ప్రభావంతో రాష్ట్ర రాజకీయ(Telangana Politics) సమీకరణాలు సమూలంగా మారనున్నాయి. రాష్ట్ర శాసనసభలో 119 స్థానాలు ఉన్నాయి. 33 శాతం అంటే 40 సీట్లు మహిళలకు రిజర్వ్ కానున్నాయి.

ఎస్సీ, ఎస్టీ రిజర్వ్​డ్ నియోజకవర్గాల్లోనూ మహిళా రిజర్వేషన్లు(Women Reservation) అమలు కానున్నాయి. రాష్ట్రంలో ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 స్థానాలు ఉన్నాయి. 33 శాతం చొప్పున ఎస్సీ నియోజకవర్గాల్లో 6, ఎస్టీ నియోజకవర్గాల్లో 4 మహిళలకు కేటాయించే అవకాశం ఉంటుంది. మిగిలిన 88 నియోజకవర్గాల్లో.. 30 స్థానాలు మహిళలకు రిజర్వ్ కానున్నాయి. అయితే మహిళలకు స్థానాల కేటాయింపు కోసం ఏ పద్ధతి అనుసరిస్తారన్నది చూడాల్సి ఉంది.

Union Cabinet Meeting : ప్రత్యేక సమావేశాల వేళ కేంద్ర కేబినెట్​ భేటీ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం

Women Reservation Bill Telangana 2023 : రాష్ట్రంలో జిల్లాల వారీగా నియోజకవర్గాల సంఖ్య విషయంలో భారీ వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ జిల్లాలో ఏకంగా 15 నియోజకవర్గాలు ఉండగా.. కొన్ని జిల్లాల్లో ఒకే ఒక్క నియోజకవర్గం మాత్రమే ఉంది. తద్వారా జిల్లా యూనిట్‌గా మహిళా రిజర్వేషన్ల అమలు కష్టం కావచ్చు. ఏడు అసెంబ్లీల సీట్ల చొప్పున ఉండే లోక్‌సభ(Lok Sabha) నియోజకవర్గం యూనిట్‌గా మహిళా సీట్లను కేటాయించే అవకాశం ఉండవచ్చని అంటున్నారు. సాధారణంగా ఎక్కువ మంది మహిళా ఓటర్లు(Women Voters) ఉన్న స్థానాలను మొదట మహిళలకు కేటాయించి ఆ తర్వాత రొటేషన్ విధానంలో మిగతా సీట్లను కేటాయించవచ్చు.. లేదా లాటరీ విధానంలో కేటాయింపు చేయవచ్చు.

Parliament Special Session 2023 : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సర్వం సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు విపక్షాల పట్టు

Women Reservation Bill 2023 : ఇటీవల ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితా(Draft List of voters) ప్రకారం రాష్ట్రంలోని.. 64 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. మహిళలు సీట్ల కేటాయింపు(Seats Allotment) ఏ పద్ధతిన చేస్తారన్న విషయంపై ఇప్పటి వరకు ఆయా స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహించే నేతల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. రాష్ట్రానికి లోక్​సభలో 17 స్థానాలు ఉండగా.. అందులో మూడో వంతు అంటే ఆరు సీట్లు మహిళలకు దక్కనున్నాయి. ఎస్సీ స్థానాలు మూడు, ఎస్టీ నియోజకవర్గాలు రెండు ఉన్నాయి. అయితే చట్ట సభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్‌ సహా.. 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఈ రెండింటినీ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టాలని బీఆర్​ఎస్​ పార్లమెంటరీ పార్టీ సమావేశం(BRS Parliamentary Party meeting) డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

MLC Kavitha Women's Bill 2023 : 'అధికారంలో ఉన్న మోదీ సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదు?'

మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం కాంగ్రెస్‌ పోరాడితే మేం మద్దతు ఇస్తాం: కవిత

Last Updated : Sep 19, 2023, 12:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.