బైక్‌లోని హారన్‌కి తెలియకపోవచ్చు... రైడర్ హెల్మెట్‌లో హైడ్ అయి ఉండొచ్చు.... కానీ వారికి మెట్రోలే కాదు పెట్రోల్ కూడా తెలుసు.. బ్రేక్ ఫాస్ట్‌నే కాదు బైక్ బ్రేక్స్నీ హ్యాండిల్ చేయగలరు.. అన్నింటిలో పోటీ ఇవ్వగలం అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన మహిళా బైక్ రైడర్స్. ఈ బృందానికి ఊపిరి పోసింది జై భారతి. బైక్ రైడింగ్ మొదలుపెట్టి నేటికి ఏడేళ్లు. అయినా అలుపనేది లేదు. దేశ విదేశాల్లో బైక్ రైడ్ చేస్తూ వాహ్.. అనిపిస్తున్నారు.
వారి పయనం కిలోమీటర్లలో నిలవాలని కాదు.. చరిత్రపుటల్లో నిలవాలని. అత్యవసర పరిస్థితుల్లో ఎవరి కోసం వేచి చూడకూడదని.. తమ జీవితాన్నే స్వారీగా మార్చుకున్నా రు ఈ బైక్ రైడర్స్.
హైదరాబాద్‌కు చెందిన జయ భారతి సాహస యాత్రల్లో చురుగ్గా పాల్గొంటారు. పలు దేశాల యునెస్కో సైట్లను సందర్శించారు. సవాలుగా తీసుకుని తానూ ఒంటరిగా పర్యటనలు చేశారు. టర్కీ, నేపాల్ వంటి దేశాల్లోనూ యాత్రలు చేశారు. జయ భారతి గురించి తెలుసుకున్న తెలంగాణ ప్రభుత్వం వారి బృందానికి చక్కటి అవకాశం ఇచ్చింది. మోటర్ బైక్ రైడర్ జయ భారతి నేతృత్వంలో 7 దేశాలు, 17 వేల కిలోమీటర్లు, నలుగురు మహిళా బైక్ రైడర్లు తెలంగాణ టూరిజం ప్రమోషన్లో భాగంగా చేసిన సాహస యాత్ర ఎవరూ మర్చిపోలేరు. ఈ తెలుగు రైడర్స్ దేశ విదేశాల్లో సత్తా చాటారు.
ఈ బుల్లెట్ రాణులు ఎలాంటి టూవీలర్స్నైనా అవలీలగా నడిపేస్తారు. 400 సీసీ బైక్‌లను రయ్యిమనిపిస్తారు. వీరు నడిపే బైక్స్‌కు ప్రత్యేక గేర్లు ఉంటాయి. బుల్లెట్‌పై సవారీ చేస్తూ మరెందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అనేక సందర్భాల్లో మహిళలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. వారిలో స్ఫూర్తి పెంచేందుకు కృషి చేస్తున్నారు. మహిళా బైక్ రైడర్స్‌గా వీరు ఏడవ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జయ భారతి టీమ్ కు ఈటీవీ భారత్ ప్రత్యేక శుభాకాంక్షలు అందిస్తోంది.
ఇవీచూడండి: సరదా జీవనాధారం అయింది... అందరికి ఆదర్శంగా నిలిచింది