ETV Bharat / state

నాకు ఆడపిల్లలంటే ప్రాణం.. కానీ నా భార్యకు అబార్షన్ చేయండి.. కన్నీరు పెట్టించే ఓ తండ్రి కథ - భ్రూణ హత్యలపై మహిళా దినోత్సవం స్పెషల్ స్టోరీ

Women's Day Special Story 2023 : మహిళా దినోత్సవం వచ్చేసింది. న్యూస్ పేపర్లలో.. టీవీల్లో.. డిజిటల్ మీడియాలో.. వాట్సాప్ స్టేటస్‌లలో.. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో.. ఫేస్‌బుక్ పోస్టుల్లో.. ట్విటర్ ట్వీటుల్లో.. ఇలా ప్రతి మాధ్యమంలో మహిళల సాధికారత, ఇన్నేళ్లలో వారు సాధించిన ఘనతలు.. మేల్ డామినేటెడ్ సమాజంలో మహిళలు తమకంటూ సాధించుకుంటున్న గుర్తింపు.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వెనకబడిన స్త్రీల జీవితాలు.. కొందరు పురుషుల చేతుల్లో నలిగిపోతున్న మహిళల భవిష్యత్ ఇలా రకరకాల స్టోరీల గురించి చూశాను. ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడో నేను విన్న ఓ కథ గుర్తొచ్చింది. ఆకాశంలో సగం.. అవకాశంలో సగం అంటూ నేటి మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తూ.. చివరకు చంద్రునిపై కూడా కాలు పెట్టగలిగే స్థాయికి ఎదిగారు. పురుషులతో సమానంగా కాదు కాదు .. కొన్ని రంగాల్లో పురుషుల కంటే మిన్నగా ఎదుగుతూ తమ సత్తా చాటుతున్నారు. ఇంతటి ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలోనూ.. ఎంతో ఉన్నత విలువలు, ఆలోచనలు కలిగిన ఓ తండ్రి.. పురుషులు మహిళలు సమానం అని మనసా వాచా కర్మనా భావించే ఓ తండ్రి తనకు ఆడపిల్ల పుట్టబోతోందని తెలిసి ఆ బిడ్డను పుట్టక ముందే చంపేయాలనుకున్నాడు. అందుకోసం డాక్టర్‌కు కాల్ చేసి బేబీని అబార్షన్ చేయమన్నాడు. ఎన్నో ఏళ్లుగా తన ఇంట్లో ఆ చిన్నారి కేరింతలు వినాలని ఎంతగానో తాపత్రయ పడ్డ ఆ తండ్రి ఆడపిల్ల అని తెలియగానే ఎందుకు తొలగించాలని అనుకున్నాడో ఆ డాక్టర్‌కు చెప్పాడు. అంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తెలిసి ఆ డాక్టర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆ కారణమేంటో తెలిస్తే మీరూ కంటతడి పెట్టక మానరు. అదేంటంటే..?

Women's Day Special Story 2023
Women's Day Special Story 2023
author img

By

Published : Mar 8, 2023, 4:01 AM IST

Updated : Mar 8, 2023, 7:00 AM IST

నాన్న : హలో డాక్టర్ మానవి మాట్లాడుతున్నారా

డా. మానవి : హా అవునండీ చెప్పండి

నాన్న : నా భార్య తల్లి కాబోతోంది.

డా. మానవి : కంగ్రాట్స్

నాన్న : కానీ ఆడపిల్ల పుట్టబోతోంది

డా.మానవి : అయితే డబుల్ కంగ్రాట్స్

నాన్న : కానీ మీరు అబార్షన్ చేయాలి

డా.మానవి : ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు

నాన్న : ఏం మాట్లాడుతున్నాను.. కరెక్ట్‌గానే మాట్లాడుతున్నా కదండీ

డా.మానవి : ఓహ్... అబ్బాయి కావాలనుకున్నారా.. కానీ అమ్మాయి అని తెలిసేసరికి

నాన్న : నో.. నాకు అమ్మాయే కావాలి అనుకున్నాను

డా.మానవి : మరి.. అబార్షన్ ఎందుకు చేయించాలని అనుకుంటున్నారు..?

నాన్న : ఎందుకంటే.. నా బిడ్డను రేప్ చేస్తారు. నేను నా బంగారు తల్లి రేప్‌నకు గురికావడం తట్టుకోలేను. అందుకే ఈ భూమ్మీదకు తనని తీసుకురావాలనుకోవడం లేదు

నాన్న : నాకు తెలుసు డాక్టర్ మీకు కోపం వస్తోందని. బట్ ఐయామ్ రియల్లీ సారీ. కానీ మీరు అబార్షన్ చేయాల్సిందే. నాకు తెలుసు మీకు రోజు ఇలాంటి కాల్స్ చాలా వస్తాయని. కానీ వాటికి కారణం.. ఆడపిల్ల పుడితే పోషించలేమని.. కట్నం ఇచ్చి పెళ్లి చేసే స్తోమత లేదని.. లేకపోతే వారసుడే కావాలని ఇలా రకరకాల కారణాలతో అబార్షన్ చేయమని మీ వద్దకు వస్తుంటారు. ఇన్నాళ్లూ ఇలాంటి కారణాలతో మీ వద్దకు వచ్చేవాళ్లు. కానీ ఇప్పటి నుంచి తమకు ఆడపిల్ల వద్దని ఎందుకంటే ఏదో రోజు తనపై అత్యాచారం జరగకుండా ఉండదనే భయంతో వస్తుంటారు. ఆ దారుణాన్ని తట్టుకుని తాము బతకలేమనే బాధతో వస్తుంటారు.

వరంగల్‌లో ఆరు నెలల పసికందుపై అత్యాచారం జరిగింది. ఆరు నెలలు.. అంటే ఆ పాప ఎంతుంటుందో తెలుసా డాక్టర్. ఆ పాప ఆరోగ్యంగా ఉంటే మన ఒక అరచేతిలోకి వస్తుంది అంత చిన్నగా ఉంటుంది. అలాంటి పసికందుపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నేను మీకు ఇందుకే కాల్ చేస్తాను ఇలాంటి దారుణాలు ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి.. జరుగుతూనే ఉంటాయి. వీటిని ఎంత వీలైతే అంత త్వరగా కట్టడి చేయకపోతే ఎంతో మంది చిన్నారులు బలవుతూనే ఉంటారు.

బేటీ బచావో.. బేటీ పడావో.. ఈ స్లోగన్ చూసి అందరూ ఎందుకు అంతా ఆనంద పడతారో నాకసలు అర్థం కాదు. బేటీ బచావో.. అసలు ఆడపిల్లను రక్షించాలనే మాట ఎందుకొస్తోంది. ఎందుకు.. అసలు ఎందుకు మనం ముందుగానే అమ్మాయిలు బలహీనంగా ఉంటారు. అందుకే వీళ్లను చదివించాలనే ఆలోచన చేస్తుంటాం. అసలు అమ్మాయిలు బలహీనులు అనే మాటను మనం ఎందుకు ముందు నుంచే మాట్లాడుకుంటున్నాం. ఎందుకు మీరు వీక్ అనే మాటను వాళ్ల మనసులోకి చిన్నతనం నుంచే పాయిజన్‌లా ఎక్కిస్తున్నాం. కొడుకులకు చెప్పండి అమ్మాయిలను గౌరవించండి అని లేకపోతే చెంప పగులుతుంది అని ఇలాంటి స్లోగన్ ఎందుకు మనం తీసుకురావడం లేదు.

కొంతమంది అమ్మాయిలను బయటకు పంపించడం వల్లే అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయని భావిస్తుంటారు. అసలు అమ్మాయిలను బయటకు ఎందుకు పంపాలి. వాళ్లని వంటగదికే పరిమితం చేస్తే.. ఇంటి పనుల్లో బిజీగా ఉంచితే ఇలాంటి ఘోరాలు జరగవు కదా అని మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్లకు నాదొకటే ప్రశ్న. హన్మకొండలో ఓ చిన్నారిపై తన బంధువే కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి ఆమె రక్తపు మడుగులో పడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ పాపను ఆస్పత్రికి తీసుకువెళ్తే.. ఆ చిన్నారి బాధతో వేసే కేకలు తట్టుకోలేక ఆస్పత్రిలో ఉన్నవాళ్లంతా గుండెలవిసేలా రోదించారు. ఇక ఆ పాప తల్లిదండ్రుల పరిస్థితిని మీ ఊహకే వదిలేస్తున్నాను.

హిందూ, ముస్లింలు.. 24 గంటలు ఒకరినొకరు తిట్టుకోవడానికి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడానికి.. మీ మతం గొప్పంటే మీ మతం గొప్ప అని సవాళ్లు విసురుకుంటూ ఉంటారు కదా. ఇంత కంటే భయంకరమైన సమస్య మన సమాజాన్ని చుట్టుముడుతోంది. మన ఆడపిల్లల మాన ప్రాణాలు తీస్తోంది. మీకు దమ్ముంటే ముందుగా దాన్ని ఆపండి. మీ వెనకున్న సైన్యాన్ని మీలో మీరు కొట్టుకోవడానికి కాదు.. ఆడపిల్లలపైన అఘాయిత్యాలకు పాల్పడే మృగాలను వేటాడేందుకు ఉపయోగించండి.

ఇంకో మాట.. అమ్మాయిలేం తక్కువ కాదు. పురుషులతో సమానమే అనే మాట చెప్పేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి. అమ్మాయిలు ఎవరికంటే తక్కువ కాదు అని మీరు ప్రత్యేకంగా చెబుతున్నారంటే మీ మనసులో ఏదో మూలన అమ్మాయిలు తక్కువ అనే భావన ఉన్నట్టే. అదే మాట అబ్బాయిలు తక్కువేం కాదు అని ఎప్పుడైనా చెప్పారా.. చెప్పలేదు.. చెప్పరు కూడా ఎందుకంటే మగాళ్లు ఎప్పుడూ నంబర్ వనే అనే భావన. మగాళ్లెప్పుడు ఎక్కువే అనే అహంకారం.

అందుకే డాక్టర్ నేను భూమ్మీదకు ఆడపిల్లను తీసుకురావాలని అనుకోవడం లేదు. ఒకవేళ తీసుకొచ్చినా తనను ఈ రాక్షసులుండే సమాజం నుంచి కాపాడుకోగలుగుతాననే నమ్మకం లేదు. ఎందుకంటే తనకు నేను స్వేచ్ఛనిచ్చినా.. ఈ సమాజం ఏదో రకంగా సంకెళ్లు వేయాలని చూస్తుంది. ఒకవేళ తను ఆ సంకెళ్లనే రెక్కలుగా చేసుకుని పైకి ఎగరాలని ప్రయత్నించినా.. ఏదో రకంగా ఆ రెక్కలను విరిచేస్తారు. చివరకు తాను పడుతూ లేస్తూ.. నాన్నా నేనెంతో ప్రయత్నించాను కానీ.. ఓడిపోయానని నా దగ్గరకు వస్తే తనను ఓదార్చే శక్తి నాకు లేదు డాక్టర్.

ఈ స్టోరీ విన్న తర్వాత ఆ డాక్టర్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇలాంటి కారణాలతో ఎవరూ ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ కోసం తన వద్దకు రాలేదు. తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తండ్రి పడుతున్న ఆవేదనలో ఆ కన్నపేగు చెబుతున్న ప్రతి మాటలో నిగూఢ అర్థం తనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఓ ఆడపిల్ల తల్లిగా ఆ తండ్రి పడుతున్నా ఆవేదనను తనకంటే బాగా ఎవరూ అర్థం చేసుకోలేరు అని అనిపించింది ఆ డాక్టర్‌కు.

ఇంతేనండి.. ఇంత వరకే నేను ఆ స్టోరీ విన్నాను. ఈ మహిళా దినోత్సవం రోజున ఎందుకో నాకు మీతో ఈ స్టోరీ షేర్ చేసుకోవాలని అనిపించింది. ఇందులో సాధికారత ఏం లేదు.. కానీ నేటి ఆధునిక యుగంలో రోజురోజుకు ఆడపిల్లలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్ల తల్లిదండ్రులు ఆడపిల్లలను కనాలంటే భయపడుతున్నారు. ఒకప్పుడు ఎలాగైతే ఆడపిల్లలను కనాలని భయపడ్డారో.. ఆ భయం నుంచి బయటపడి నెమ్మదిగా అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏ రకంగా తీసిపోరనే భావనతో అమ్మాయిలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల వల్ల మళ్లీ కథ మొదటికే వస్తోంది. మళ్లీ తల్లిదండ్రులు ఆడపిల్లలను కనడానికి భయపడుతున్నారు. కానీ ఈసారి ఆ కారణం వెనక గుండెలను మెలిపేట్టే బాధ ఉంది.

Last Updated : Mar 8, 2023, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.