ETV Bharat / state

మహిళల అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై పీడీ యాక్ట్​

author img

By

Published : Oct 29, 2019, 7:35 AM IST

మహిళల అక్రమ రవాణా చేస్తోన్న ముగ్గురిపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించారు. ఈ నెల 21న 10 మందిని అరెస్టు చేయగా.. ఈ ముగ్గురిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

మహిళల అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై పీడీ యాక్ట్​

మహారాష్ట్రకు చెందిన అసద్, షరీఫ్, అయూబ్​పై హైదరాబాద్​ రాచకొండ కమిషనర్​ మహేశ్​ భగవత్​ పీడీ కేసు నమోదు చేశారు. ఉపాధి పేరిట బంగ్లాదేశ్ యువతుల్ని నగరానికి తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో... పహాడీషరీఫ్ పోలీసులు ఈ నెల 21న 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో మహారాష్ట్రకు చెందిన ఈ ముగ్గురు... మహిళల అక్రమ రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 10మందిని అరెస్ట్ చేసి అక్టోబర్​ 21న చర్లపల్లి జైలుకు పంపించారు. అసద్, షరీఫ్, అయూబ్​పై గతంలోనూ అక్రమ రవాణా కేసులుండటం వల్ల నిందితులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలుగా ఉన్న ముగ్గురు యువకులు మరో ఏడాది పాటు జైల్లోనే ఉండనున్నారు.

ఇవీ చూడండి : 'రాముడిని నిత్యం స్మరించే భాజపా నిజం చెప్పాలి'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.