ETV Bharat / state

అవరోధాలను అధిగమించింది.. అందరికీ అమ్మయింది!

'అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ.. కష్టాల వారధి దాటిన వారికి అది సొంతమవుతుంది...' అన్నారో రచయిత. వాస్తవానికి గాయపడ్డ వారికే తెలుస్తుంది ఆ నొప్పి ఏంటో..! నా అనుకున్నవారు దూరమైతేనే అర్థమవుతుంది ఒంటరితనం ఎంత కష్టమో..! అలాంటివెన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఓ మహిళ. ఆ కుంగుబాటు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూనే.. ఎవరూ లేని వారికి అమ్మయ్యింది. కష్టాల్లో ఉన్నవారికి ఓదార్పయింది. ఆమే ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన గంగాసాగర్‌ బాయి.

women overcame obstacles .. Become mother to 80 kids today in the name of a welfare society
అవరోధాలను అధిగమించింది.. అందరికీ అమ్మయ్యింది!
author img

By

Published : Mar 22, 2021, 2:06 PM IST

ఆర్థిక ఇబ్బందులు, వైవాహిక సమస్యలు... వంటివి సవాల్‌ విసిరినా ఆమె బెదిరిపోలేదు. తాను ఆత్మవిశ్వాసంతో అడుగులేస్తూ... ఆపన్నులకు తనవంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. మార్చలేని గతం గురించి బాధపడటం తనకు ఇష్టముండదు అంటూనే.. చేతిలో ఉన్న భవిష్యత్ కోసం శ్రమిస్తానంటోందీవిడ. తనే ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన గంగాసాగర్‌ బాయి.

గంగాసాగర్‌ బాయి నాన్న సీతారాం చిన్నప్పుడే చనిపోయారు. అమ్మ దేవాబాయి... ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. తన పిల్లలు తనలా కాకూడదన్నది ఆ తల్లి తపన. అందుకే గంగాబాయిని ఉట్నూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేర్పించిందామె. అక్కడే గంగ పదో తరగతి వరకు చదివింది. కానీ పై చదువులకు ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. దాంతో ఆమె ఇళ్లల్లో వంటపనిచేస్తూ...ఇంటర్‌ పూర్తిచేసింది. గంగ మొదట్నుంచీ చదువుతోపాటు క్రీడలు, సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు... అన్నింటిలోనూ చురుగ్గా ఉండేది. ఆమె ప్రతిభను గుర్తించిన ఐటీడీఏ అధికారులు... స్థానికంగా ఓ పాఠశాలలో స్కౌట్స్‌ ఉపాధ్యాయురాలిగా నియమించారు.
పిల్లలు లేరని...

ఉద్యోగంలో స్థిరపడ్డాక గంగాబాయి పెళ్లి చేసుకుంది. జీవితం ఇకనైనా సంతోషంగా సాగిపోతుందనుకుని కలలుకంది. కానీ అలా జరగలేదు. మూడేళ్లయినా పిల్లలు కలగలేదని భర్త వేధించేవాడు. మానసికంగా చిత్ర హింసలు పెట్టేవాడు. అయినా ఓపిగ్గా భరించింది. కానీ అదే కారణం చూపించి మరో పెళ్లి చేసుకున్నాడతను. అప్పుడు గంగను ఒంటరితనం చుట్టేసింది.

సొంత ఖర్చుతో వృద్ధాశ్రమం..

దాన్నుంచి ఎలాగైనా బయటపడాలనుకుంది గంగా. ఆ ప్రయత్నాల నుంచి వచ్చిన ఆలోచనే... ‘మాతృసాగరం వెల్ఫేర్‌ సొసైటీ’. అమ్మగా బాధ్యత తీసుకుని ఎనభై మందిని చదివిస్తోంది. ఆరుగురికి పెళ్లిళ్లూ చేసి అత్తారింటికి పంపించింది. పదిహేను లక్షల రూపాయల ఖర్చుతో వృద్ధాశ్రమాన్నీ నిర్మిస్తోంది. ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోన్న ఈవిడ.. ప్రస్తుతం దేవుగూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తోంది.

ఇదీ చదవండి: కళ్లలోకి.. కళ్లు పెట్టి చూస్తే.. మాట్లాడగలరా.. మైండ్​ పని చేస్తుందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.