మొట్టమొదటిసారి హైదరాబాద్‌లో మహిళ పారిశ్రామిక వేత్తలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆగస్టు నెలలో ప్రదర్శనకు ఉంచాలని నిర్ణయించినట్లు ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్ సోన చత్వాణి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలతోపాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళ పారిశ్రామిక వేత్తలు ప్రదర్శనలో పాల్గొననున్నారు. మొత్తం 200 మంది ఆగస్టు 10, 11 తేదీల్లో హైటెక్స్‌లో జరిగే స్టైలతత్వ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ఉంచుతారని వారు వివరించారు. ఈ ప్రదర్శనలో పాల్గొంటున్న మహిళలకు జాతీయ స్థాయిలో జరిగే ప్రదర్శనలో పాల్గొనే అవకాశం కూడా రావచ్చని తెలిపారు. ప్రదర్శనతో కూడి అమ్మకపు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మకం కంటే కూడా మహిళ పారిశ్రామిక వేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు చొరవ చూపుతున్నారని ఆమె వివరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 75 శాతం లోటు వర్షపాతం