ETV Bharat / state

వనస్థలిపురంలో ఆకలికి మన్ను తిన్న మహిళ - రెడ్ జోన్

పోస్టాఫీసులో డబ్బులు తీసుకుందామని వచ్చి గంటల తరబడి క్యూలో నిల్చున్న ఓ మహిళ ఆకస్మాత్తుగా స్ప్రృహ కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధి వనస్థలిపురంలో చోటు చేసుకుంది.

ఆకలికి స్ప్రృహ కోల్పోయిన మహిళ
ఆకలికి స్ప్రృహ కోల్పోయిన మహిళ
author img

By

Published : May 4, 2020, 9:37 PM IST

హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధి వనస్థలిపురంలోని పోస్టాఫీసు ముందు ఎండలో గంటల తరబడి నిల్చున్న ఓ మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్పందించిన స్థానికులు బాధితురాలిని స్ప్రృహలోకి తీసుకొచ్చారు. ఆకలి, దాహంతో బాధిత మహిళ రహదారిపైనున్న మట్టిని తినడం ప్రారంభించగా కాలనీ వాసులు ఆమెను నీడలోకి తీసుకువెళ్లారు.

ప్రతి రోజూ తెల్లవారు జామున 5 గంటల నుంచే వనస్థలిపురం పోస్టాఫీసు ముందు జనం కిక్కిరిసి ఉంటున్నారు. రెడ్ జోన్​గా ప్రకటించిన తర్వాత కూడా గుంపు తగ్గట్లేదు. బ్యాంకులో ఖాతా లేని వారికి పోస్టాఫీసులో డబ్బు పంపిణీ చేస్తుండటం వల్లే రద్దీ నెలకొంటోంది.

ఇవీ చూడండి : కొహెడ మార్కెట్‌లో ఈదురుగాలుల బీభత్సం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.