ETV Bharat / state

Women Blackmail Case in Hyderabad : రూ.లక్షలు ఇస్తానంటూ మత్తులోకి దించి.. నగ్నంగా చిత్రీకరించి.. ఆపై బెదిరింపులు - వివాహిత నగ్న వీడియోల బెదిరింపులు కాల్స్

Women Blackmail Case in Hyderabad : హైదరాబాద్​లోని ఓ వివాహితకు రూ.లక్షలు ఇస్తాను.. స్కార్ఫ్​ కట్టుకుని నగ్నంగా నటించాలంటూ ఎర వేశాడు. హోటల్​కు రమ్మని పిలిచి కూల్​డ్రింక్​లో మత్తు మందు ఇచ్చి నగ్నంగా చిత్రీకరించాడు. ఆపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది.

Women Blackmail Case in Hyderabad
Lewd Video Blackmail Case in Hyderabad
author img

By

Published : Aug 5, 2023, 5:41 PM IST

Hyderabad Woman Video Blackmail Case : నగరంలో అమ్మాయిలపైన అఘాయిత్యాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఒకరు కాస్త మంచిగా పలకరిస్తే చాలు.. వెంటనే నమ్మేసి అన్ని విషయాలు చెప్పేసుకుంటారు కొందరు. ఇదే అదనుగా తీసుకుంటారు కొందరు ఆకతాయిలు. వారు ఏ సమస్యల్లో ఉండి కష్టాలు చెప్పుకుంటున్నారో అని ఆలోచించకుండా వారి ఇబ్బందులను ఆసరాగా తీసుకొని అమ్మాయిలను వాడుకుంటారు. ఆర్థికంగా, శారీరకంగా ఇలా పలు విధాలుగా వాడుకొని అమ్మాయిలను నానా హింసలు పెడుతుంటారు.

Video Blackmail Case in Hyderabad : మహిళలు కూడా వారికున్న చట్టాలు.. ఇవన్నీ మరచి ఏ దిక్కూ లేదని మోసగాళ్ల వలలో పడుతున్నారు. కొందరు మహిళలు వారికి జరిగిన పరిస్థితి ఇంకొకరికి జరగకుండా బుద్ధి చెప్పడానికి బయటకు వస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలా చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాధికారులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఇలాంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్టవేయలేకపోతున్నారు. తాజాగా వివాహిత మహిళ ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదించాలి అనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. కానీ చివరికు కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన పంజాగుట్ట​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

ఓ వివాహిత ఆర్థిక అవసరాన్ని ఆసరాగా చేసుకుని.. డబ్బు ఆశ చూపించాడో కేటుగాడు. ఓ వెబ్​సైట్​కు అవసరమైన వీడియోలో ముఖాన్ని కప్పేసి నటిస్తే రూ.లక్షలు ఇస్తానంటూ నమ్మబలికాడు. అనంతరం ఆమెకు తెలీకుండా మత్తు మందు ఇచ్చి నగ్నంగా వీడియో చిత్రీకరించాడు. తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్​ చేస్తూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఆమె పంజాగుట్ట పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

ఆర్థిక అవసరాన్ని ఆసరాగా చేెసుకొని..: ఏపీలోని విశాఖ పట్నానికి చెందిన దిల్​సుఖ్​నగర్​లోని ఉంటున్న వివాహిత (26) వెడ్డింగ్ ప్లాన్స్​ చేస్తుంటారు. నాలుగేళ్ల క్రితం బోనాల చెన్న కేశవ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. నెల కిందట ఆమెకు ఫోన్​చేసి తనకు ఒక వెబ్​సైట్​ ఉందని, ముఖానికి స్కార్ఫ్​ కట్టుకుని నీలిచిత్రంలో నటిస్తే నిర్వాహకులు రూ.10 లక్షలు ఇస్తారని నమ్మించాడు. ఆమెకున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా అతని మాటలు నమ్మింది. అనంతరం ఆమెను పంజాగుట్టలోని ఒక హోటల్​కు రమ్మనాడు. గదికి పిలిచి మద్యం తాగాలన్నాడు. ఆమె నిరాకరించడంతో కూల్​డ్రింక్​లో మద్యం కలిపి తాగించాడు. మత్తులోకి వెళ్లాక ఆమెను నగ్నంగా వీడియో తీశాడు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఆమెకు ఫోన్​ చేసి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. లేదంటే నగ్న వీడియోలు వెబ్​సైట్లో పెడతానని బెదిరించాడు. రోజురోజుకూ చెన్న కేశవ పెట్టే బెదిరింపులు పెరగడంతో ఈ నెల 2న ఆమె పోలీసులను ఆశ్రయించింది. వారు చెన్న కేశవపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.