నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి... ఈటీవీ ప్రొడ్యూసర్ అని చెప్పుకుంటూ పలువురిని మోసం చేస్తున్న శ్రీలత అనే మహిళను రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందినట్లు గుర్తించారు. నిందితురాలు తుమ్మల శ్రీదేవి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి ఈటీవీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని ప్రచారం చేసుకుంది. గతేడాది వంశీ అనే వ్యక్తి నుంచి రూ.50 వేలు వసూలు చేసింది. 2017లో మాట్రిమోని పేరుతో క్రాంతి అనే యువకుణ్ని మోసగించి రూ.6 లక్షలు వసూలు చేసిన కేసులో పోలీసులు ఆమెను కటకటాల్లోకి నెట్టారు. సామాజిక మాధ్యమాల్లో గుర్తు తెలియని వ్యక్తులతో స్నేహం చేయవద్దని సైబర్ క్రైం అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి : రెండు ఇళ్లలో చోరీ... నగదు, నగలు అపహరణ