హైదరాబాద్ టోలిచౌకి ప్రాంతానికి చెందిన మహిళ.. తన పిల్లల చేతులకు తాడుతో కట్టేసి, ఆమె నడుముకు కట్టుకుని నీటిలోకి దూకేందుకు యత్నించింది. వారిని లేక్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భరోసా కేంద్రానికి పంపించి ఆమెకు న్యాయం చేస్తామని సీఐ ధనలక్ష్మీ తెలిపారు.