ETV Bharat / state

woman sexually assaulted : లిఫ్ట్‌ ఇస్తానన్నాడు.. లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఇంతలో మహిళ ఏం చేసిందంటే.! - Sexual assault on woman

Woman sexually assaulted at Tarnaka Hyderabad : మహిళలపై రోజురోజుకి లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. నెలల వయస్సు ఉన్న చిన్నారి మొదలుకొని పండు ముసలి వరకు తరచూ ఎక్కడో ఒక్క చోట మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తార్నాక వద్ద లిఫ్టు పేరుతో బైక్ ఎక్కించుకుని ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

woman was sexually assaulted
woman was sexually assaulted
author img

By

Published : Jul 3, 2023, 10:35 PM IST

Sexual assault after giving a Bike lift at Hyderabad : మహిళల రక్షణకు ప్రభుత్వం ఎన్ని రక్షణ చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒక చోట లైగింక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఆఫీసుల్లో, కాలేజీల్లో ఈ మధ్య కాలంలో పాఠశాలల్లో సైతం మహిళలపై లైంగిక దాడులు అధికమవుతున్నాయి. కొందరు మానవ మృగాలు తమ పశువాంఛను తీర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. చివరకి హత్య చేసి మరి మహిళలపై లైగింక దాడులకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం.

తాజాగా హైదరాబాద్‌లో లిఫ్ట్‌ పేరుతో బైక్ ఎక్కించుకుని యువతిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు, దగ్గరి బంధువుల కథనం ప్రకారం.. గత సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో హైదరాబాద్‌లోని తార్నాక దగ్గరలో ఓ హోటల్‌ వద్ద తన కూతురికి పాల ప్యాకెట్ కోసం ఓ మహిళ బయటకు వచ్చింది. ఇంతలో అటువైపు నుంచి ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వచ్చాడు.

woman sexually assaulted giving a bike lift : సదరు మహిళ లిఫ్ట్‌ కోసం ఎదురు చూస్తుండగా.. అదే అదునుగా భావించిన సదరు యువకుడు బాధితురాలును బైక్‌పై ఎక్కించుకున్నాడు. తార్నాక నుంచి మెట్టుగూడ వద్ద దింపుతానని ఆ యువకుడు నమ్మించాడు. అతడి మాటలను నమ్మిన ఆ యువతి... వాహనం ఎక్కింది. కొంత దూరం వెళ్లిన తరువాత ఆమెతో ఆ యువకుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఆమె ప్రతిఘటించగా.. మెట్టుగూడ సమీపంలో బైక్‌ యూటర్న్ చేస్తుండగా ఆమె వాహనంపై నుంచి దూకేసింది.

దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే సదరు యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తనను లైంగికంగా వేధించడంతోనే బైక్‌పై నుంచి దూకినట్లు బాధితురాలు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని... అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

"పాల ప్యాకెట్‌ కోసం నేను తార్నాక వద్దకు వచ్చాను. ఇంతలో ఒక వ్యక్తి బైక్‌పై వచ్చాడు. లిఫ్ట్‌ ఇస్తానన్నాడు. కానీ నేను ఆ బైక్‌ ఎక్కలేదు. అతను నన్ను బలవతం చేసి మరి బైక్‌ ఎక్కించుకున్నాడు. ఇంతలో బైక్‌పై కూర్చుంటే నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బైక్​ను చాలా వేగంగా నడుపుతూ నన్ను వేధించాడు. ఇంతలో యూటర్న్‌ దగ్గర నేను పడిపోయాను. నా సెల్‌ఫోన్‌, నా దగ్గర కొద్దిగా డబ్బులు ఉంటే అవి కూడా తీసుకొని వెళ్లిపోయాడు".- బాధితురాలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.