హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని చిలుకానగర్లో దారుణం జరిగింది. అదే కాలనీలో నివాసం ఉంటున్న అంజయ్య అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం అతని భార్య.. పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. అంజయ్య రాత్రి ఓ మహిళను ఇంటికి రప్పించుకున్నాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. మద్యం మత్తులో అదే రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది.
కోపోద్రిక్తుడైన అంజయ్య ఆవేశంతో మహిళ తలపై బీరు సీసాతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకున్న అంజయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అంజయ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఇవీ చూడండి: ఆదివారం కరోనా పరీక్షలకు ఆటంకం.. మూడొంతుల కేంద్రాల మూత