శీతాకాలం ప్రారంభంలోనే చలి పంజా విసురుతోంది. డిసెంబర్ మూడోవారం, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధికంగా ఉండాల్సిన చలి నవంబర్‌లోనే తీవ్రంగా నమోదవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. రాత్రి, తెల్లవారుజాము సమయంలో చలి తీవ్రత అధికంగా ఉంటోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోను చలి ప్రభావం ఎక్కువగా ఉంది.
ఉదయం వేళల్లో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతల కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. చలి వల్ల యాచకులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లో బర్త్‌డే పార్టీలతో కిటకిటలాడే నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాలు చలి ప్రభావంతో జనాలు రాక బోసిపోతున్నాయి. చలి భయానికి ప్రజలు బయటకు రాకపోవడం చిరు వ్యాపారులకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. జనాలు లేక నగరంలోని రహాదారులు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఇదీ చూడండి: 'ఉద్యోగం కోసం గడప దాటినప్పుడే భవిష్యత్తు బాగుపడుతుంది'